Saturday, December 16, 2023

 *_ఇదేగా ఘ(మ)నచరిత్ర..!_*
_______________________

అడుక్కున్నా గాని 
ఆకలి తీరని 
బాలలున్న దేశంలో
ఘనమైన సభాభవనాలు..
భారీ విగ్రహాలు
ప్రతిష్టాత్మక ఆలయాలు..!

************************

పేదోడి ఆశ్రయం కూల్చేసి 
అక్కడే కడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం చూడు..!

************************

గుడిలో భారీ ముడుపు..
బయట యాచకుడి
కడుపు నింపరా అంటే
చిల్లర కోసం
జేబు తడుముడు..!

************************

చట్టసభల్లో ఎన్నో బిల్లులు
పెండింగులో..
ప్రజాప్రతినిధుల వేతనాల
పెంపు బిల్లులు
బల్లలు చరుస్తూ
తక్షణ ఆమోదం...!

************************

అవినీతి అంతంపై బిల్లుకు
అవినీతి చక్రవర్తుల 
ముసాయిదా..
మరో వాయిదా..
వారికే ఫాయిదా..!

************************

ఎన్నికల్లో పోటీ అంటే
ఉచితాల్లో పోటీ అన్నమాట..!

************************

తెలంగాణలో మహిళలకి 
బస్సు ప్రయాణం ఉచితం..
అయ్యో.. అడపుటకైనా
పుట్టాను కాదే..
మగమహారాజుల అక్కసు..
ఇదెక్కడ తిరకాసు..!

************************

*_సురేష్..9948546286_*

No comments:

Post a Comment