Sunday, December 17, 2023

మంచి మాటలు

 ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ మరియు ధనుర్మాస ప్రారంభ  శుభాకాంక్షలు 💐🌹🤝 ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి వారి అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...ఈ రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాశీస్సులు 💐🌹🙌🥭

*ఆదివారం --: 17-12-2023:--*
ఈ రోజు *AVB* మంచి మాటలు 
      పరోపకారానికి మించిన *పుణ్యం* లేదు , పరనిందను మించిన *పాపం* లేదు , ఒకరు మీకు *నష్టం* కలిగించినంత మాత్రాన వారిపై *నిందలు* మోపాల్సిన పని లేదు, *అర్థం* కాకపోతే తెలుసుకోడానికి ప్రయత్నిoచాలి కానీ *అపార్థం* చేసుకోకూడదు , 
         
      ఒక్క *క్షణంలో* జీవితం ఏమీ మారిపోదు *కానీ* ఆ ఒక్క క్షణంలో *ఆలోచించి* తీసుకునే *నిర్ణయం* జీవితాన్నే మార్చేస్తుంది , ఉన్నది ఉన్నట్లు *మాట్లాడే* వాళ్లను ఎవరూ *నమ్మరు*, అదే మనసులో *స్వార్థం* పెట్టుకుని పైకి *ప్రేమ* నటించే వాళ్ళను అందరూ *ఇష్ట* పడుతుంటారు .

          ఒక *చెడ్డగుణం* వంద *సమస్యలకు* కారణం అవుతుంది . ఒక *మంచి గుణం* వంద సమస్యలను పరిష్కరిస్తుంది, *సులువుగా* వచ్చినది ఏదైనా *విలువ* తక్కువ, *కష్టించి* సంపాదించిన దానికి విలువ *ఎక్కువ* .

      *ప్రశ్నించడం* అంటే ఎదిరించడం కాదు *వాస్తవాల* కోసం *సత్యం* కోసం *స్వేచ్చ* కోసం *నీతి నిజాయితీ* కోసం *అభివృద్ధి* కోసం అడగడం,

.     కొన్ని సార్లు *మనకి* ఎదురయ్యే *సమస్యలే* కొత్త కొత్త *పాఠాలను* నేర్పుతాయి, నీ *సామర్ద్యాన్ని* నీకు తెలిసేలా చేస్తాయి *నీ వాళ్ళు* ఎవరో *పరాయి వాళ్ళు* ఎవరో కూడా నీకు తేలిసేలా చేస్తాయి .

      ✒️ *మీ .. *AVB సుబ్బారావు, 9985255805*

No comments:

Post a Comment