Saturday, December 23, 2023

కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుంది.

 *కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుంది.*

*ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది*

*ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే*
*ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు*

*దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది*

*ఏమీ  అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి*
*రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు*
 
*ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.*

*అతడి పరిస్థితి* *తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను*
*కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు*

*భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది*

*భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు*

*సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త*

*వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది*

*దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు*

*జీవతం చాలా నేర్పిస్తుంది*

*నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది*

*అహంకారం అసలు పనికిరాదు*
*జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు*

*ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని*
*నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.*

 *మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది.*

No comments:

Post a Comment