Friday, December 22, 2023

విద్యుత్ కథ* *లేక* *ఆవుకథ* . (కథ) రచన:

 .             *విద్యుత్ కథ*
                      *లేక* 
                 *ఆవుకథ* 
.              (కథ) 
రచన: 
 *నీలం సత్యనారాయణ* 

🌸💐☘️🌸💐☘️🌸💐☘️
" *అయ్యో* ! డామిట్ ! పాడు కరెంటు ఇప్పుడే పోవాలా?
ఆవు కథ పూర్తిగా చూడకుండానే కరెంటు పోయిందిగా" విసుగ్గా అన్నాడు టి.వి. నుండి తల తిప్పుతూ చంటి. 

"అలా కరెంటును *పాడు*  అనకూడదు రా అబ్బాయీ 
విద్యుత్తు ఆ పరమాత్మ ప్రసాదించిన ఒక వరం.. " బామ్మ మందలింపుగా అన్నది.

"మరి కరెంటు పోతే ఆవు కథను ఎలా చూడాలి?" అన్నది చిన్ని.
"ఆ ఆవు కథ పాతదే కదా ...  ఐనా మనం ఆ కథను దాదాపూ చూశాం కదా .. " అన్నది బామ్మ. 
"ఔననుకో..." అని ఏదో చెప్పబోయాడు చంటి. 
"మరి ఆ కథ వలన 
ఏమర్థమయింది మీకు" అడిగింది బామ్మ ..

"మనం ఏది చెప్ప వలసి వచ్చినా, దానిని ముందు మెన్షన్ చేసి, సంబంధం లేని విషయాన్ని దానికి అంటగడితే దానిని ఆవుకథ అంటాం. " అన్నది చిట్టి.

"యు ఆర్ కరెక్ట్... మాటలకే కాదు .. పనులకైనా ఆ  కథానీతి వర్తిస్తుంది... 
లేని సంబంధాన్ని సృష్టించు కొని మరీ కొన్ని పనులు చేయరాదు. 
అలా చేసి ఏ రూపంలోనూ *నియమాలను* *అతిక్రమించకూడదన్నమాట*  .."

"నువ్వుచెప్పేది అర్థంకావటం లేదు గానీ బామ్మా ...  విద్యుత్తు  ఆ దేవుడిచ్చిన దేమిటో అన్నావుగా...  అదేమిటో చెప్పు ." అన్నాడు చంటి.
 
" ఔను  కరెంటు అంటే విద్యుత్తు ఆ పరబ్రహ్మ ప్రసాదించిన ఒక వరము .... కొందరు ఆ పరబ్రహ్మే ఇందులో దాగి ఉన్నాడనీ భావిస్తారు. అంటే అది ఆ దేవుడి రూపం.  అది లేనిదే మనం చాలా పనులు చేయలేము. వెనుకటి రోజుల్లో సులభంగా చేయలేని పనులనెన్నింటినో  మనం ఈనాడు సులభంగా చేయగలుగుతున్నాం...   అందుకే విద్యుత్తు ఉన్న కాలం లో పుట్టిన వారు అదృష్టవంతులు అనిపిస్తుంది." అన్నది బామ్మ. 

ఐతే ఆ విద్యుత్ కథేమిటో  చెప్పు బామ్మా " అని అడిగాడు మరోసారి  చంటి ...
"ఔను .. కరెంటు వచ్చేవరకు ఆ కరెంటు కథను చెప్పు బామ్మా " అంటూ చిన్ని కూడా అడిగింది. 

 *బామ్మ ఇలా చెప్పటం ప్రారంభించింది:* 
"విద్యుత్ ఓ గొప్ప ఆవిష్కరణ. విద్యుత్ అనేది మనం ఈనాడు వాడుతున్న రూపములో కనిపించదు. అలాగే మనం  ఈ నాడు   వాడే విద్యుత్ ఉపకరణాలైన లైట్లూ ఫ్యానులూ కూడా, గీజర్లూ, వాషింగ్ మెషీన్లూ, ఒవెన్లూ, టి.వి, కంప్యూటర్, చిన్న పెద్ద ఫ్యాక్టరీలూ,  నీళ్ళు తోడే విద్యుత్ మోటార్లు, విద్యుత్ కార్లూ  మున్నగునవి  పురాణాలలోనూ
కావ్యాలలోనూ  కనీసం జానపద సినిమాలలోనూ కనపడవు..... అంటే  ఈ రూపంలో కనపడవు. 
ఆ రోజుల్లో 
ఆ యుగాల్లో కూడా కరెంటు ఉన్నదో లేదో, 
ఉన్నా విద్యుత్ పరికరాలున్నాయలేవో, 
ఉన్నా వాటిని వాడకుండా, మనుషులనూ పశు పక్ష్యాదులనే ఎందుకు  వాడుకున్నారో తరువాత మీ తాతయ్యనడగండేం... 
కానీ, 
నాకు తెలిసినంత వరకూ, 
విద్యుత్ అన్న పదం ఎప్పటి నుండో ఉన్నది.
అమరకోశం మొదటి కాండలోనే  దిగ్వర్గం లో ఇలా ఓ శ్లోకం ఉంటుంది:

 *శ్లో॥* *శప్పాశత హ్రదాహ్రాదిన్యైరావత్యః క్షణప్రభా౹* 
 *తటిత్సౌదామినీ విద్యుచ్చఞ్చలా చపలాపిచ॥* 

ఈ శ్లోకములో  శంప, శతహ్రదం, క్షణప్రభ, తటిత్తు, చపలా మున్నగు పదాలతో పాటూ సమానార్థకముగా *విద్యుత్తు* ను కూడా పేర్కొన్నారు
ఇందాక చెప్పుకున్నట్లు , 
పురాణ కాలంలోనూ, రాజుల కాలంలోనూ *మనం వాడే పద్ధతిలో*  విద్యుత్ లేకపోవటం వలన  
మనుషులే అధికముగా శ్రమపడేవారు.  జంతులులనూ, వర్కర్లనూ శ్రమపెట్టేవారు. 
ఇతర వస్తువులనూ  పదార్థాలను (అనగా నూనెదీపాలనూ, రత్నాలను కాంతికి వాడినట్లే ) ఇతర ప్రయోజనాలకు విద్యుత్ బదులు గా కొన్ని వస్తువులను వాడేవారు.  

ఈ నాటి దేవాలయాలలో సైతం ఆధునికముగా   వెలుతురుకై లైట్లకోసం ,  మాటలనూ  పాటలనూ సుదూరం వినిపించేందుకు మైకులకోసం వాడుతూంటే , కొన్ని గుళ్ళలో డ్రమ్స్, బెల్ ను కూడా మనుషులు కొట్టకుండా విద్యుత్ యంత్రాలే కొట్టే  ఆచారం నూ విద్యుత్ వినియోగం తో కొనసాగిస్తున్నారు...   అలాగే కొందరు దేవుళ్ళను అభిషేకించే సందర్భంలోనూ భక్తులు స్వయముగా తమ చేతులతో  నీళ్ళను, పాలనూ పోయకుండా విద్యుత్ యంత్రాలు పాలనూ నీళ్ళనూ పోసే  విధంగా  ఏర్పాటు చేసుకున్నారు.  వాటిని చక్కగా భక్తితో  వినియోగిస్తున్నారు.  అంటే సాంప్రదాయబద్ధమైన  పనులలోనూ, ఆధునికమైన పనులలోనూ విద్యుత్ ను వాడవచ్చు ... ఐతే  ప్రాచీన ఆచారార్థము వెలిగించు  దీపాలూ మున్నగునవి పరిమిత ప్రయోజనము  గలవి.    అందుకే  ఆ  నూనె దీపాలనూ, ఈ విద్యుద్దీపాలనూ కూడా వాడుతున్నారన్నమాట " 

"ఔను బామ్మా .. గుడిలో కరెంటు పోతే దాదాపూ చీకటిగానే ఉంటుంది. " అన్నది చిట్టి.

"అందుకే అక్కడ ఇన్వర్టర్స్ పెడతారు" అన్నాడు చంటి. 

"ఔను .. ఐతే అది చార్జి కావాలన్నా అంతకు ముందు విద్యుత్ ఉండాలి" అన్నది చిట్టి.

దానిని విన్న బామ్మ:
"అది సరే గానీ
మరి ఇండియాలో విద్యుత్ ఎప్పుడు వచ్చిందో తెలుసా?"
అని అడిగి, 
వాళ్ళ జవాబు కై ఎదురు చూడకుండా,
"ఇండియాలో విద్యుత్తు అప్పటి కలకత్తాలో 1879 లో   మొదటి సారి   P.W. Fleury & co వారు  వీథిలో సుమారు 36 ఎలక్ట్రిక్ బల్బులను ప్రదర్శించినప్పుడు వచ్చిందట... మరే ప్రాంతంలోనైనా ఆ సమయానికి వెనుకా ముందూ  వచ్చి ఉండనూ వచ్చు ... 

మొదటగా 1892 లో అనైకుంటా  ది ఇండియన్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ వారికి ముందుగా విద్యుత్తు తయారు చేసే అనుమతి లభించిందట.. ఆ సంస్థ పేరే తరువాత  
 ద కల్కటా ఎలక్ట్రిక్ సప్లై కార్పోరేషన్ లిమిటెడ్ గా మారిందట.  

ఆ నిర్వాహకులు విద్యుత్ ను అందరూ వాడుకో వచ్చని సూచించారట... 
ఐతే,
 అదో  పిశాచ రాక్షస మాయాజాలమనీ, 
 బ్రిటీషు ప్రభుత్వం కుట్ర అనీ భావించిన    *సాంప్రదాయవాదులూ* 
 *ధనవంతులైనవారూ* 
  నిరసించారట. ఉచితముగా విద్యుత్తునిచ్చినా వారు  తీసుకోలేదట  .....
కానీ  బీదవారూ, కూలీలు, హిందూ మతేతరులూ  మున్నగు వారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారట ... 

1910లో ప్రైవేటు కంపెనీలు విద్యుత్ తయారు చేసుకోవటానికి ప్రభుత్వం అనుమతించింది. 
స్రాతంత్ర్యం వచ్చాక 1948 లో State Electricity Boards ఏర్పడ్డాయి. 
1976 లో మార్చిన విద్యుత్ చట్టాల వలన NHPC;  NTPC;  NPCL 
; NPCIL  లాంటి సంస్థలు వచ్చాయి.. 

ఆ విషయం అటుంచితే
రెండు వేల ఏళ్ళ క్రితమే భారత్ లో అగస్త్య్యుడు  విద్యుత్ ని గూర్చి చెప్పాడని కొందరంటే ... క్రీ.పూ.2750 లోనే ఈ జిప్ట్లో విద్యుత్ కు చెందిన ఆధారాలున్నాయని కొందరంటారు ...
ఐతే ఆనాటి పద్ధతులలో విద్యుత్ ఎలా చేయాలో తెలియక పోవటం వలన కాబోలు 
మైఖెల్ ఫారడే, బెంజమిన్ ఫ్రాంక్లిన్ మున్నగువారు 
ఎన్నో ప్రయత్నాలను చేయ వలసి వచ్చింది.  ఈ నాటి ఈ విద్యుత్ రూపం రావటానికి ఎన్నో ప్రయోగాలు చేశారు ... కెమికల్స్ తో  సెల్ లను  తయారు చేశారు ... ఆ తరువాత మాగ్నటిక్ ఫీల్డ్ను లో కాపర్ కాయిల్ ను రొటేట్ చేయటం ద్వారా విద్యుత్ ని తయారు చేశారు...   చేస్తున్నారు ... అలాగే ఫోటోవోల్టాయిక్ సెల్స్తోనూ ఆ తరువాతా తయారు చేస్తూన్నారు ... ఇంకా 
టర్బైన్లు, బాయిలర్లూ, గ్రిడ్లూ, స్టెప్ అప్ ,స్టెప్డౌన్ ట్రాన్స్ ఫార్మర్లు ... ఇలా ఎన్నో పరికరాలని, వ్యవస్థలని నిర్వహిస్తూ,  వివిధ రంగాలలో ఎంతో మంది నిరంతరం కృషి చేస్తే,  ఇప్పుడూ చేస్తూనే ఉంటే గానీ మనం ఇలా చక్కగా ఏ.సి గదుల్లో  టి వి  చూస్తున్నాం...
ఇంకా ఆధునికంగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి... ప్రయోగ శాలల్లో ముఖ్యంగా సూపర్ కండక్టివిటీ మీద బాగా ప్రయోగాలు చేస్తున్నారు.... "

"సూపర్ కండక్టివిటీ అంటే ఏమిటీ?" అడిగాడు చంటి.
"అంటే ఇప్పటి విద్యుత్ రవాణా లో అంటే ట్రాన్స్ పోర్ట్లో ఎంతో వృధా ఔతుందట... దానిని తగ్గించే  ప్రయోగాలన్నమాట " అన్నది బామ్మ. 

"కరెంటు పోతే సినిమాహాళ్ళలో జనరేటర్ లోంచి  కరెంటు ఎలా వస్తుంది బామ్మా" అడిగింది చిట్టి.
దానికి బామ్మ ఇలా చెప్పటం మొదలెట్టింది:
"కరెంటును పెట్రోలియం ప్రాడక్ట్స్ తోటీ తయారు చేయవచ్చు ... ఐతే ఖర్చెక్కువ ... ఖర్చు కొంత తక్కువైనా థర్మల్ విద్యుత్తును తయారు చేయాలంటే కూడా బొగ్గు మున్నగు వాటి వలన  ఖర్చు ఔతుంది . ...
నీళ్ళ ద్రారా హైడ్రో పవర్ తయారీకి టర్బైన్ల సమకూర్పు కోసం  ఖర్చు ఔతుంది... కొంచెం ఖర్చు తక్కువైనా నీళ్ళు అనసరం  .. అన్ని సమయాలలో నీరు సమృద్ధిగా ఉండక పోవచ్చు గదా ... అందుకే  సోలార్ విద్యుత్తైతే బాగుంటుంది ... 
ఐతే ఎండ ఉచితమేగానీ సోలార్ పానెల్స్ తయారీకి మాత్రం  కొంచెం ఖర్చు చేయవలసినదే.  
రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ద్వారా ఎటామిక్ ఎనర్జీని అదే  న్యూక్లియర్ ఎనర్జిని    కరెంటుగా తయారు చేయవచ్చు.. కానీ చాలాకాలం క్రిందట అప్పటి రష్యా లోని చెర్నో బెల్ లో పెద్ద ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు . పైగా ఖర్చెక్కువ"

అలా అంటూండగానే కరెంటు వచ్చింది. 
పిల్లలిద్దరూ అసంకల్పితముగా  తమ రెండు చేతులనూ పైకెత్తి నమస్కరించారు. 

లైట్లు వంక  ఎ.సి వంకా అపురూపంగా చూస్తున్నారు... 

అంతలో  కరెంటు రావటంతో  ఆన్ ఐన  టి.వి.లో 
ఓ ప్రవచన కారుడు ఇలా సెలవిస్తున్నాడు:
ఈ విశ్వం అంతా ఆ పరమాత్మ  సృష్టే. అన్ని జీవరాశులూ, అన్ని శక్తులూ అతనివే".
 కార్యక్రమం పూర్తయినట్లు మురళీ రవం రావటంతో 
టి. వి. ని చూసిన
లా అఫ్ కన్జర్వేషనాఫ్ ఎనర్జి అంటే ఏమిటో   తెలిసిన 
రిటైర్డు ఫిజిక్స్ లెక్చరర్ ఐన బామ్మకు  అందులో  గోమాత చెంతనే ఉన్న బాలకృష్ణుడి వర్ణచిత్రం కనిపించింది...  
🔵

( *తెలుగు కథల అభిమానులం* వాట్సపు సమూహార్థం 
19-12-2023 నాడు రాసిన ప్రత్యేక కథ సమాప్తం)

No comments:

Post a Comment