అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో అందంగా ఉండేది.. దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే ఆశ కలిగేది...
అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి... చెట్టు బోసిపోయింది.. అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు., ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు...
అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు., తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! అనే నమ్మకంతో బతుకుతుంది..
కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది.., అంతే చెట్టులో చలనం మొదలైంది.. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , పూవ్వులు వికసించాయి.. మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... ఆ చెట్టు...!
మనిషి జీవితము అంతే...,
ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..
కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు...
అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..
నిజానికి మాయమయిన ప్రతి నవ్వూ ఏదో ఒకటి నేర్పే వెల్తుంది. నేర్చుకోవడం తెలియాలంతే...
ఈరోజు నీవేమైవున్నావో అది నీ మాయమైన నవ్వు ల సమాహారం.. నీ నేటి ఆత్మ స్థైర్యానికి సాక్షి...
సమస్య లేని చోట
సమాధానం కోసం వెదక్కు !
సమాధానం లేని చోట
సమస్య సృష్టించకు !
సమస్య ఉన్న చోట
సంగతి జటిలం చేయకు !
సమాధానమున్న చోట
సమస్యను చూడకు !
సమస్యలేని జీవితం
అవనిలో అసలే ఉండదు !
సమాధానంలేని సమస్య
సాధారణంగా కనబడదు!..
ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా నమ్ము...
అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం.. ఆదిత్యయోగీ..
గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి...
కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..
ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు.. కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు..
గుర్తుంచుకో.,
నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు., దానికి సమయం రావాలి.. మనకు సహనం ఉండాలి...
No comments:
Post a Comment