Sunday, December 17, 2023

_టీపై క్లారిటీ!_

 *_టీపై క్లారిటీ!_*

☕☕☕☕☕☕☕

ఓ హాయ్..
దాంతో పాటు ఓ చాయ్..
జనాన్ని నడిపించే ఇంధనం
మన సంస్కృతికి మూలధనం!

అన్నిటా వెరై"టీ"..
ఉన్నత చదువులకు యూనివర్సి"టీ"..
దయ చూపాలంటే పి"టీ"..
చిన్న ఊరు 
అభివృద్ధి సాధిస్తే సి"టీ"..
సాంకేతిక ప్రగతి ఐ"టీ"..
పేమెంట్లకు పే"టీ"ఎం..
సొమ్ము తీసేందుకు ఎ"టీ"ఎం..
వయసు మళ్ళినాక
వచ్చే గౌరవం ఆం"టీ"..
ఇవన్నీ పక్కన పెడితే 
అస్సలైన క్వాలి"టీ"..
అస్సాం టీ..
మురిపించే ఇరానీ టీ..;

పెద్దోళ్ల పార్టీలైతే హై టీ..
పేదోళ్ళకు బడ్డీ టీ..
ఇప్పుడు కొత్తగా
టీ టైం..టీ ట్రీ..
టీ హౌస్..టీ గార్డెన్..
పేరేదైనా దొరికేది అదే టీ నీళ్ళు
చిన్నోడి దగ్గర కొంటే 
అతగాడికి ఆ రోజు గంజినీళ్లు..
మామూలు వ్యాపారికి 
నాలుగు రాళ్లు..

నలుగురు ఓ చోట చేరితే..
కాలక్షేపానికి..
స్నేహ బంధానికి..
అతిధి మర్యాదకి..
అలసట నుంచి విముక్తికి..టీ
ఒక్కోసారి 
అన్నం మానేసి టీ..
మొత్తానికి ఈ టీతో మానవజీవితానికి విడదీయలేని బంధం..
"గాఢ"మైన అనుబంధం..
ఇంటింటా అది 
వెదజల్లే సుగంధం..
అసలు టీ కి లేనే లేదు పోటీ!

కొసమెరుపు..
దంపతుల అనుబంధం..
వన్ బై టూ చాయ్.. 
స్నేహబంధానికి టూ బై త్రీ..
ఎంజాయ్ మెంట్ ఫ్రీ..!

టీడే శుభాకాంక్షలతో..
*ఎలిశెట్టి సురేష్ కుమార్*
      9948546286

No comments:

Post a Comment