మోటివేషనల్ స్టోరీ 🤝💞
"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.." చాలామందికి ఈ మాట సుపరిచితమే.
"పని చెయ్యడమే నీ వంతు, దాని ఫలితాల మీద నీకు ఎలాంటి అధికారం లేదు" అని! అందరికీ ఈ అర్థమూ తెలుసు. కానీ ఎవరం ఫాలో అవ్వం.
మెంటల్ ట్రాప్స్ చాలా ఉంటాయి. వాటిలో ఇదో ట్రాప్. దృష్టి ఎప్పుడూ ఫలితం మీద ఉంటుంది.. పని శ్రద్ధగా చెయ్యడం ఏమాత్రం ఉండదు. ఈ రోజంతా కష్టపడితే సాయంత్రానికి వెయ్యి రూపాయలు వస్తాయనే ఓ ఉదాహరణ తీసుకుంటే.. దృష్టంతా వెయ్యి రూపాయల మీదనే ఉంటుంది తప్పించి, రోజంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచెయ్యాలన్న కృతనిశ్చయం ఉండదు.
సో ఒకవేళ ఏదోలా రోజు గడిపేసి సాయంత్రానికి డబ్బులు రాలేదనుకోండి.. మైండ్ గందరగోళంగా మారిపోతుంది, నిస్పృహ ఆవరిస్తుంది. ఇక్కడ చాలామందికి ఎండ్ రిజల్ట్స్ మాత్రమే కావాలి. ప్రాసెస్‌ని, ప్రయాణాన్నీ అస్సలు ఎంజాయ్ చెయ్యరు. దీంతో అనుకున్నది జరగక, ఫలితం ముందు నుండే అనుకున్నది కావడం వల్ల దాని నుండి ఎలాంటి సంతృప్తీ దొరక్కా జీవితం పట్ల ఉత్సాహం తగ్గుతుంది.
"ఈ క్షణం నువ్వెలా ఉన్నావు" అని ఎవర్ని అడిగినా ఏదో ఏడుపుగొట్టు ఎక్స్ప్రెషన్ కన్పిస్తుంది. నిజానికి ఈ క్షణానికి ఏం ఢోకా లేదు. అంతా బాగుంది. కానీ దృష్టంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా.. బయట ఇష్టమొచ్చినట్లు ఎప్పుడు తిరుగుదామా అన్న దాని మీద ఉంటుంది. సో ఈ క్షణాన్నీ, ఈ క్షణం చేసే పనినీ ఆస్వాదించే వాడు కర్మయోగి. వాడిని ఎలాంటి ఫలితమైనా పెద్దగా కదిలించదు. జీవితాన్ని ప్రతీ క్షణం పూర్తిగా జీవిస్తుంటాడు. సో ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయి.. ఎండ్ రిజల్ట్స్ కోసం ఈ క్షణంలో నీ మనస్సులో దాగి ఉన్న అలౌకిక ఆనందాన్ని త్యాగం చెయ్యకు. ప్రపంచం ఎప్పుడెలా ఉన్నా.. నీ లోపల చాలా సంతోషం దాగుంది. అది గుర్తించిన వాడే యోగి.. లేదంటే భోగంలోనే సంతోషం వెదుక్కుని, మరుసటి క్షణం నీరసంగా బ్రతుకీడ్చవలసి వస్తుంది.
𝕃𝕚𝕗𝕖 𝕝𝕖𝕤𝕤𝕠𝕟𝕤🔥
No comments:
Post a Comment