Sunday, December 17, 2023

_కలకాలం జీవించే.._* *_ఆ కుంచె..!_*

 *_కలకాలం జీవించే.._*
*_ఆ కుంచె..!_*

🖌️🖌️🖌️🖌️🖌️🖌️🖌️

బాపూ జయంతి సందర్భంగా
ప్రణామాలు అర్పిస్తూ..

++++++++++++++++++

విశ్వసుందరిని మించిన ముద్దుగుమ్మ..
అప్సరసను తలదన్నే  
అందాల రెమ్మ..
బాపూ బొమ్మ..!

ఆయన కుంచె..
సీతకే అందం పెంచె..
వాల్మీకి నాయిక 
బాపూ బొమ్మగా..
మరింత సొగసుగా..!

అందమైన కళ్లుంటే
బాపూ బొమ్మే
విస్తుపోవు కదా 
సృష్టించిన ఆ బ్రహ్మే..
నలువను మించిన విలువా
ఈ సత్తిరాజుకు
అందమైన బొమ్మల మహరాజుకు..!

ఇంట్లో బామ్మలూ 
మాటాడే బొమ్మలే..
సిరిసిరి మువ్వలు
బాపూ సృష్టించే అవ్వలు..!

తెలుగు సినిమా చరిత్రలో
బాపూ గీసిన 
అందమైన *ముత్యాలముగ్గు..*
కళ్లకు కట్టిన *సంపూర్ణరామాయణం..*
అలరించిన *సీతాకల్యాణం*
పులకింపజేసిన గంగావతరణం
బాపూ తీసిన ప్రతి సినిమా
ఓ దృశ్యకావ్యం...
వాల్మీకి రాసిన కథ 
మళ్లీమళ్లీ రసరమ్యం..!

స్నేహానికి పేరెన్నిక 
బాపూ రమణలు..
జతగా సృష్టించారు
పురాణాలకు 
కలియుగ రూపాలు..
వారి ప్రతిభకు 
ప్రతి సినిమా ఓ *సాక్షి..*
ఒకరు *బుద్ధిమంతుడు*
మరొకరు *అందాలరాముడు..*
బాపూ సినిమాను తోలే *జాకీ*
ముళ్ళపూడి మాటల *బుల్లెట్..*
ఇద్దరూ కలిసి నడిపిన
*రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్*
వినోదాన్ని పంచిన 
విజయా వారి హబ్..!

తెలుగోడి గర్వం బాపూ..
అందమైన బొమ్మకు 
సర్వం బాపూ..
ఆయన కొలువు 
ఒంపు సొంపు బొమ్మల *వంశవృక్షం..*
ఈ సత్తిరాజు లక్ష్మీనారాయణ
చిత్రరంగాన..
చిత్రకళా రంగాన
చిరస్మరణీయ మహావృక్షం..!
    
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
      9948546286

No comments:

Post a Comment