Dr.Av Guruvareddy గారు తన అనుభవాన్ని పంచుకున్నారు ....
నా OP లో, పేషెంట్లు - నొప్పులు
మందులు - మాటలు ఇలా నడుస్తూనే ఉంటాయి!
వాటితో పాటు, ఎన్నో భావోద్వేగాలు,
ఊహకందని కథలు కూడా తారసపడతాయి!
అలాంటి ఒక చక్కటి చందమామ కథే
'SK Patcha Bee ' గారిది!
అమ్మ కి తోడుగా పిల్లలు రావడం సహజమే,
కానీ, వున్న ఆరుగురు పిల్లలు రావడం ఓ ప్రత్యేకతే!
అవును, ఎనభై ఐదు ఏళ్ళు దాటినా తమ తల్లిని చూపించడానికి
యాభైలు అరవైలు దాటినా ఆరుగు పిల్లలు,
తోడుగా నీడగా వచ్చారు!
అమ్మ మీద ప్రేమ చూపించడానికి
'తోడు'ని మించిన భాష మరోటేముంటుంది?
అయితే కథ ఇక్కడితో ఆగలేదు,
ఆ ఎనభై ఏళ్ళ అమ్మగారు Dementia తో బాధ పడుతున్నారు,
అంటే జ్ఞాపక శక్తి లేకపోవడం, జరిగిన విషయాలు మర్చిపోవడం!
అంటే, బహుశా తన ఆరుగురు పిల్లలు తనతో పాటు వచ్చారనే జ్ఞాపకం
తనతో ఎక్కువ సేపు ఉండదు!
గుర్తుండిపోవాలని మనలో ఎంతో మంది మంచి చేస్తుంటాము,
కానీ మర్చిపోతుందని తెలిసినా,
కడుపు తీపితో, 'కూడా' వచ్చిన ఆ ఆరుగురు పిల్లలని చూసి
ఎదో తెలియని తృప్తి, ఆనందం కలిగాయి!
బహుశా, పిల్లలు బాధ్యతగా ఉండటం అంటే,
తల్లి తండ్రులకి దెగ్గరగా లేక దూరంగా ఉండటం కాదు,
వాళ్ళని కనిపెట్టుకొని ఉండటం!
అది ఆ ఆరుగురిలో చూసి భలే స్ఫూర్తి కలిగింది!
సమాజంలో ఎంతో మంది పిల్లలకు, తల్లి తండ్రులకు ఒక పాఠంలా మిగిలిపోయింది..!
ఈ అరుదైన కథని మీతో పంచుకుందామని ఇలా..
Dr AV Gurava Reddy
No comments:
Post a Comment