Tuesday, December 12, 2023

భయం లేని చోట జీవితం.. అందం ఉంటాయి.

 నేడు నేను చదివిన మంచి మెసేజ్.
- Abdul Naseer
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

*ఇది చదివితే అన్ని భయాలు పోతాయి* 

భయం.. భయం.. భయం..
ఉద్యోగం పోతుందని భయం,
ఆరోగ్యం బాగుండదని భయం... 
ఇష్టపడే స్నేహితులు దూరం అవుతారని భయం.. 
ఎవరూ ప్రేమించరేమోనని భయం.. 
ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమోనని భయం..
ఆర్థికంగా ఎలా ఉంటుందోనని భయం... 
పిల్లలు సరిగా చదవరేమోనని భయం.. 
ఇష్టమైంది తింటే లావైపోతామేమోనని భయం..
అందంగా లేమనే బెరుకు..
ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఫెయిల్ అవుతుందేమోనని భయం.. 
పిల్లి ఎదురైతే భయం..
రాత్రయితే నిద్రపట్టదేమోనని భయం.. 
సినిమా థియేటర్‌కి వెళితే పార్కింగ్ దొరకదేమోనని భయం.. 
ఐస్‌క్రీమ్ తింటే జలుబు చేస్తుందేమోనని భయం..

చేసే ప్రతీ పనిలోనూ భయమే.
ఇన్ని భయాల మధ్య మీరు జీవిస్తున్న జీవితం ఏముంది?

ఒక్కసారి అన్ని భయాలూ తెంచుకుని చూడండి..
రొమ్ములిరుచుకుని కొన్ని క్షణాలు.. 
కొన్నంటే కొన్ని క్షణాలైనా బ్రతికి చూడండి. 
అదిరా.. అదీ.. జీవితం అంటే! 

బిక్కుబిక్కుమంటూ ప్రతీదానికీ భయపడుతూ బ్రతికేదీ ఓ బ్రతుకేనా?

అందరి హృదయాలూ భయాల వల్ల కుంచించుకుపోతున్నాయి. ముడుచుకుపోతున్నారు.
మొహంపై స్వచ్ఛమైన చిరునవ్వు ఉండదు. 
ఏదో నవ్వాలి కాబట్టి పెదాలు బలవంతంగా విడదీసి నటిస్తున్నారు. 
అదేం నవ్వు.. నీ నవ్వుని నువ్వు అద్దంలో చూసుకుంటే రోబోట్‌లా అనిపించడం లేదా? 
హృదయాన్ని విప్పార్చి చూడండి.. 
బలవంతంగా కాదు.. సహజాతిసహజంగా నవ్వు ఆటోమేటిక్‌గా వస్తుంది. అద్గదీ... 
నిజమైన నవ్వంటే అది!

భయాల మధ్య నవ్వులు, ప్రేమలు, బంధాలూ, పనిపట్ల చిత్తశుద్ధీ, అంకితభావం.. 
అన్నీ మాయమై జీవశ్చవాల్లా బ్రతికేస్తున్నారు. 
నేను సాధన చేస్తుంటాను.. నూటికి 90 శాతం సందర్భాల్లో నా మానసిక స్థితిలో ఒకటే ఉంటుంది.. 
"ప్రపంచంలో నాకంటే శక్తివంతుడు, ధైర్యవంతుడు ఎవరూ లేరన్నంతగా" నా కాన్షియస్‌నెస్ నిండిపోయి ఉంటుంది. 
అప్పుడు ఉంటుంది.. మజా!! ప్రపంచాన్ని జయించినంత మజా!

అంతే గానీ, పిరికి పిరికిగా బిక్కుమంటూ ఎన్నాళ్లని కాలం గడుపుతారు. 
ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ సిస్టమ్‌ని అధిగమించండి. మైండ్‌ని అర్థం చేసుకోండి. బ్రెయిన్‌లోని అమిగ్డాలాని అర్థం చేసుకోండి. 
భయమనేది ఒక మామూలు ఎమోషన్ అన్నది గ్రహించండి. మొత్తం మారిపోతుంది.. 
మీ అంతర్గత ప్రపంచం ఉన్న ఫళంగా చాలా అందంగా, హృద్యంగా మారిపోతుంది. 

భయం లేని చోట జీవితం.. అందం ఉంటాయి.

No comments:

Post a Comment