Wednesday, December 13, 2023

ముక్తి ఎలా వస్తుంది

 *ముక్తి ఎలా వస్తుంది*

సంపద గాని ప్రాణంగానీ త్యాగం చేయటం వల్ల రాదు
 ప్రపంచక వ్యవహారాలు త్యాగం చేయటం వల్ల రాదు
 భార్య పిల్లల్ని త్యాగం చేయటం వల్ల రాదు
 రుచికరమైన భోజనాన్ని త్యాగం చేయడం వల్ల రాదు. 
అపక్వ ఆహారాన్నీ కందమూలాలనీ తినడం వల్ల రాదు
 దుస్తులను త్యాగం చేసి నగ్నంగా తిరగటం వలన రాదు 
కులాన్నీ ,మతాన్నీ, కుటుంబ ఆచారాల్నీ త్యాగం చేయడం వల్ల రాదు. 
వాక్కుని త్యాగం చేసి మౌనంగా ఉండటం వల్ల రాదు. 
తిట్లని త్యాగం చేసి మధురవాక్యాలు పలకటం వల్ల రాదు

 తాను దేహం అనే భావాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో వారికే ముక్తి వస్తుంది


సైకిల్ నేర్చుకోవడం శ్రమతో కూడిన పని
 కొన్నిసార్లు కిందపడి దెబ్బలు తగిలించుకుంటే గాని సైకిల్ బ్యాలెన్స్ చేయడం సాధ్యం కాదు
అకస్మాత్తుగా ఏదో ఒక క్షణంలో ఆ విద్య పట్టుబడుతుంది ఒకసారి వస్తే ఇక అది పోదు

 ముక్తి కోసం ప్రయత్నించడం అలాంటిదే 
ఈ ప్రయత్నంలో ఆటంకాలు కష్టాలు కన్నీళ్లు ఎదురవటమే కాకుండా అసలు దేవుడూ, ముక్తీ అనేవి ఉన్నాయా అనే అనుమానం కూడా కలిగి తీరుతుంది. కానీ ఏ క్షణంలోనో అకస్మాత్తుగా *నేనే పరబ్రహ్మని* అనే అనుభూతి కలిగాక  ఇక మళ్ళీ ఆ వ్యక్తి పుట్టడు .జన్మ పరంపర తక్షణం ఆగిపోతుంది

No comments:

Post a Comment