Wednesday, December 13, 2023

భగవంతుణ్ణి అధిక శాతం మనుషులు సాధారణంగా కష్టాలనీ, ఆపదలనీ తీర్చి ధనాన్నీ, ఆనందాన్నీ ఇవ్వమని దేవుడి దగ్గరికి భక్తిగా వెళ్తారు

 భగవంతుణ్ణి అధిక శాతం మనుషులు  సాధారణంగా  కష్టాలనీ, ఆపదలనీ తీర్చి ధనాన్నీ, ఆనందాన్నీ ఇవ్వమని దేవుడి దగ్గరికి భక్తిగా వెళ్తారు

ఇది ఆశ్చర్యంగా అనిపించినా సరే వారంతా మూర్ఖులతో సమానం అని ఆదిశంకరాచార్యులు చెప్పారు

ఇందుకు ఉదాహరణగా  ఓ కధని  చెప్పొచ్చు .ఓ పల్లెటూర్లో  ఒక మూర్ఖుడికి   ఐదు రూపాయల బిళ్ళనూ, రూపాయి బిళ్ళనూ  చూపించి ఏది కావాలి అని అడిగితే వాడు రూపాయి బిళ్ళను తీసుకునేవాడు .

ఎందుకంటే ఐదు రూపాయల బిళ్ళ చిన్నదీ ,రూపాయి బిళ్ళ పెద్దదీ కనుక అని జవాబు ఇచ్చేవాడు .
ప్రపంచంలో మనుషుల ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది .

భౌతిక సౌకర్యం, భౌతిక లాభం, భౌతిక ఆనందం కోసం చేసే కర్మల ద్వారా పొందే విలువ రూపాయితో సమానం.
 ముక్తి కోసం చేసే కర్మలు అయిదు రూపాయల  నాణెంతో సమానం.

అలా అని పుణ్యం కోసం చేసే మంచి కర్మలు కూడా ఆధ్యాత్మిక కోణం నుంచి చూస్తే దుష్కర్మలే.
ఎందుకంటే పుణ్యం అనుభవించడానికి కూడా మళ్లీ దేహం తీసుకుని పుట్టి ఇంకోసారి ప్రపంచంలోకి రావలసిన అవసరం కలుగుతుంది .

మళ్లీ పుట్టే ఏ కర్మ చేసినా సరే అది పాపం కానీ పుణ్యం గానీ మనకి మనం ద్రోహం చేసుకున్నట్టే .
మనకు మనం ద్రోహం చేసుకునే ఏ కర్మ అయినా దుష్కర్మే అవుతుంది అని మన సనాతన ధర్మం చెప్తోంది.

అలా కాకుండా చిత్తశుద్ధిని ఏర్పరిచే, నిలువ ఉన్న మన దుష్కర్మలను రద్దు చేసే నిష్కామ కర్మలను చేయటం ఐదు రూపాయల నాణెం తీసుకోవటం లాంటిది.

 భౌతిక లాభాన్ని చేకూర్చే 
స్వార్ధ కర్మలని తప్ప నిష్కామ
కర్మలని మాత్రమే చేయాలి

 ఏ పని చేసినా భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నా  అనుకోవాలి. 
చేసే ప్రతి కర్మకీ నేను కర్తను కాదు అనుకోవాలి. 
కర్మఫలం ఆశించకుండా పనిచేయాలి .
పనిచేసే కర్మల యొక్క ఫలితం నాకు వర్తించదు అనుకోవాలి.
అప్పుడు పుణ్యం ఉండదు పాపం ఉండదు.
పుణ్యం, పాపం లేని స్థితిలో ఉండాలి.
సాక్షితత్వంతో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో అన్ని పనులూ చేయాలి.

No comments:

Post a Comment