Monday, April 8, 2024

BIO-CLOCK

 *😁 BIO-CLOCK 😁*

మనం ఉదయాన్నేఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 
కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 
ఇదే *బయో-గడియారం*. 

చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 

50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో 
గాఢంగా నమ్మి   
చాలామంది తమ 
సొంత బయోక్లాక్‌ ను 
ఏర్పాటు చేసుకున్నారు. 

అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  
*మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను 
మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 

చైనాలో చాలా మంది ప్రజలు 
120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి,
అలా మానసికంగా సంసిద్దులై 
వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.

*కాబట్టి ..!*

1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 100 సంవత్సరాల వరకు *ఆరోగ్యంగా * జీవించవచ్చు.

2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. 
వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.

3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన మంచి రంగు 
వెయ్యండి.
యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. 

*ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.

4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ 
'నెగటివ్ థాట్స్' తో 
తీసుకోవద్దు. 
*ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* 
లేదంటే
~ 'ఋణాత్మక ఆలోచన'~ ల వల్ల 
మన శరీరంలో 
నెగటివ్ ఎంజైములు విడుదలై 
మన జీర్ణ వ్యవస్థను, 
మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

5. ఎప్పుడూ చురుకుగా, Active గా ఉండండి. 
నడవడానికి బదులుగా 
వీలైతే జాగింగ్ చేయండి. 

5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. 
(ఇది నిజం కూడ).

6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. 
కనుక ఆనందంగా ఉండండి 
తద్వారా ఆరోగ్యంగా ఉండండి. 
*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).

7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. 
మన ఆలోచనా విధానం. ముఖ్యంగా 
సరదాకు కూడ... 
"~నాకు Old age వస్తుంది"~
అనే మాటను అనకండి. 
8. ఖాళీగా ఏ రోజూ కూర్చోకండి. ప్రతీరోజూ ఏదో ఓ పనిచేస్తూ పనిలో నిమగ్నమైపోండి. 
మరీ ముఖ్యంగా మీకు సంతోషాన్నీ, ఆనందాన్నీ ఇచ్చే పనులు చేయండి. 
9 . పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మంచి బలమైన ఆహారాన్ని అవసరం మేరకు తినండి. 

కాబట్టి మన మానసిక 
'బయో క్లాక్' ని
ఎక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకొని ..
మన ఆలోచనా దృక్పధాన్ని మార్చుకుందాం 👍💞🥰      
*💐HEALTH IS WEALTH 💐👍*

No comments:

Post a Comment