Wednesday, August 7, 2024

శ్రీ రమణీయం - 39🌹 👌మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన 👌

 [8/7, 05:11] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 39🌹

👌మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన 👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

39. మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన

✳️ భగవంతుడు ప్రతిఒక్కరికీ తెల్ల వస్త్రంలాంటి స్వచ్ఛమైన మనసును ఇచ్చి పంపాడు. దానికి ఏరంగు అయినా అద్దుకోవచ్చు. మన మనసుకు దేన్నైనా అలవాటు చేయవచ్చు. చిన్న పిల్లలు నోట్లో వేలేసుకోవడం దగ్గర నుండి ప్రతీది వచ్చిన అలవాటేగానీ మనసు సహజ లక్షణం కాదు. సుఖ శాంతులతో జీవించాలంటే మనసుకు మంచి విషయాలలో శిక్షణ ఇవ్వాలి. విద్యార్థికి ఏ సబ్జెక్టు కష్టంగా ఉందో దాన్నే ఎక్కువసేపు చదివిస్తారు. అలాగే మనకు ఏ మంచి గుణాలు పాటించడం కష్టంగా ఉంటే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రాత్రంతా స్నేహితులతో ముచ్చట్లు చెప్తే రాని విసుగు, నిద్ర - భజనలో కూర్చుంటే వస్తాయి. మనసుకు ఉన్న గుణాలేమిటో మనకు తెలిస్తే వాటిని మార్చుకోవడం సాధ్యమౌతుంది. అందుకే ముందుగా మనసును అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక సాధన సాధ్యంకాదు♪.

✳️ *మనసును ఆవహించిన అవలక్షణాలను వదిలించటానికి భక్తి సులువైన మార్గం. మన అమ్మాయి మనకు వద్దన్నా గుర్తుకు వస్తుంది, కానీ దైవాన్ని ప్రత్యేకించి గుర్తుకు తెచ్చుకోవాల్సి వస్తుంది. నిరంతరం దైవాన్ని గుర్తుకు తెచ్చే తరుణోపాయం మంత్రం. ఆలోచనలు ముసురుకున్న మనసుకు మంత్రం ఒక దివ్యఔషధంగా పనిచేస్తుంది. అందరిదీ ఒకే మనసు. కానీ అనుభవాలే మార్పుగా ఉంటాయి. భూమి ఒక్కటే అయినా అందులో రకరకాల చెట్లు ఎలా పెరుగుతున్నాయో ఇదీ అంతే. మనం కోరుకున్న అనుభవాన్ని ఎప్పుడైనా మనసుపైకి తెచ్చుకోగలగటమే యోగం. అంటే మన ధ్యాస మన ఆధీనంలో ఉండటమే మనం సాధించాల్సిన విషయం. తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ధ్యాస వారిపైనే ఉంటుంది. ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారని తెలిస్తే వద్దనుకున్నా భయం ఆవహిస్తూనే ఉంటుంది. ఇదేవిధంగా మనసు భగవత్ చింతనతో నిండి ఉండటాన్ని భక్తి అంటారు. భక్తి ప్రయత్నంతో వచ్చేదికాదు, శ్రద్ధతో అలవడుతుంది. భక్తికీ, లౌకిక విషయాలకు తేడా ఉంది. లౌకిక విషయాలపై ఇష్టం పెరిగేకొద్దీ దుఃఖం పెరుగుతుంది. భక్తి ఎంత పెరిగితే అంతగా శాంతి లభిస్తుంది♪.*

✳️ ఇరవై ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఫలం లేదని కొందరంటారు. అంటే 20 ఏళ్ళ అశ్రద్ధ అతనిలో ఉందని అర్థం. భగవంతుని అనుగ్రహానికి క్షణకాలం స్మరణ చాలు. పిల్లవాడికి జబ్బుచేస్తే ఏడుకొండల వాడికి ఒక్క క్షణకాలంపాటు మొక్కుకుంటాం. అక్కడ దేవుని రూపంతోగానీ, స్మరించే కాలంతోకానీ పని లేకుండానే కోర్కె నెరవేరుతుంది. పిల్లాడికి జబ్బుతగ్గిన తర్వాత మన కృతజ్ఞత కోసం తిరుపతి వెళ్తున్నాము కానీ ముందు తిరుపతి వచ్చి మొక్కుకుంటేనే కోర్కె తీరుస్తానని దేవుడు చెప్పటం లేదు. క్షణంలో అనుగ్రహించే దైవానికి గంటలకొద్దీ పూజ ఎందుకు అని అనుమానం వస్తుంది. ఒక రూపంపై మనసును నిలిపే శిక్షణకోసం విగ్రహం ఎలాఅవసరమైందో, మనకి ఓర్పు, సహనం, ఏకాగ్రత నేర్పేందుకు పూజ అవసరమైంది. అంటే క్షణకాలం వచ్చి పోతున్న భగవత్ స్మరణను ఎక్కువసేపు నిలిపేందుకే పూజ అవసరం. అంటే పూజ మన మనసును బాగు చేసుకునే సాధనమేగానీ దైవాన్ని ఆకట్టుకునే ప్రయత్నంకాదు♪.

✳️ మనసుకు బాగా అలవాటైన పనికి జ్ఞాపకంతోకూడా పనిలేదు. మన ఆచార వ్యవహారాలన్నీ మనసుకు మంచి విషయాలను అలవాటుగా మార్చటంకోసం ఏర్పడినవే. మనసుకు తెల్లవారుజామున లేవడం నేర్పితే అదే అలవాటుగా మారుతుంది. ప్రతిరోజు ఆలస్యంగా నిద్రమేల్కొంటే మనసు అలాగే అలవాటు పడుతుంది. విద్యార్థులను తెల్లవారుజామున లేస్తే మంచిదంటారు. అలా లేవమని చెప్పే మన ఆచారాలు మాత్రం వద్దని అంటారు. దైవం అంటే భక్తి ఉందని చెప్తూనే పూజలు, భజనలు ఎందుకని ఆక్షేపించేవారు పని దొంగలతో సమానం. తనముందుకు వచ్చిన పనిని శ్రద్ధగా చేయటంలో సంపూర్ణత ఉందికానీ తనకు ఇష్టమైనవే చేస్తాననటంలో అసంపూర్ణతే ఉంది♪.

✳️ ప్రతిపనిలో శ్రద్ధగా ఉండగలగటం మాత్రమే కాదు, అవసరమైతే ఆ పని నుండి అంత సులభంగా తప్పుకోగలగటమే నిజమైన యోగం. టి.వి. చూస్తున్నప్పుడు కరెంటు పోయినా, తెలిసినవారు వచ్చినా విసుగుపడతాం. మనకి ఇష్టమైన విషయాల్లో మాత్రమేకాదు, మనకి ఇష్టం లేకున్నా అవసరాన్ని బట్టి శ్రద్ధ పెట్టడం మనసుకు అలవాటుచేయాలి. మన మనసుకు ఏకాగ్రత అనే లక్షణం సహజంగానే ఉంది. కాకపోతే అది మనం కోరుకున్న విషయంలో నిలవక తనకి ఇష్టం ఏర్పడిన విషయంలో ఉంటుంది. విద్యార్థికి ఫలాన్ని ఇచ్చేది చదువు. కానీవాడి ఇష్టం సినిమాపై ఉండటంచేత ఏకాగ్రత చదువు కన్నా సినిమాపైనే ఎక్కువగా నిలుస్తుంది. మనకి ప్రయోజనం చేకూర్చే విషయంలో శ్రద్ధ నిలిపేందుకే పూజలు, ఆరాధనలు అవసరమౌతున్నాయి.

✳️ భగవంతుడు మనకు తెలియాలంటే ముందు మన మనసు అర్థం కావాలి. మనసుకున్న అవలక్షణాలను వదిలించి మంచి విషయాల్లో శిక్షణనివ్వాలి. భక్తి, భజన, యోగం ఏదైనా మనసుకు మంచి శిక్షణ కోసమే. భక్తిలో, పూజలో మనం ఆ విషయాన్ని మరచిపోకూడదు. మనసుకు శాంతినిచ్చే ఏకాంతాన్ని ఇప్పటినుండే అలవాటు చేసుకోవాలి. లేకపోతే అది వృద్ధాప్యంలో శాపంలాగా పరిణమిస్తుంది.
[8/7, 05:11] +91 73963 92086: మనకు ఇష్టమైన విషయాలనుండి మనసును దేవుని రూపం వైపుకు మళ్ళించాలి. ఆ తర్వాత ఆ రూపాన్ని కూడా వదిలి తనలో తాను ఉండటం మనసుకు అలవాటు చేయాలి. పిల్లల్ని పెంచినంత శ్రద్ధగా మనసును చూసుకోవాలి. మిలటరీలో చేరిన వారితో రోజు శరీర వ్యాయామం చేయిస్తారు. ఎందుకంటే ఏ సమయంలోనైనా శత్రువుల దాడిని ఎదుర్కొనేందుకు అది శిక్షణ. మనసు కూడా అంతే. మనం ఎలా శిక్షణనిస్తే అలా ఉంటుంది. ఎవరితోనైనా ఉండగలగడం, ఎవరినైనా వదిలి ఉండగలగడమే రాగద్వేషాలకు అతీతమైన స్థితి. ఆచరణలోకి తెచ్చుకోలేని మంచిమాటలు ఎంతకాలం విన్నా ఉపయోగంలేదు. కనుక మంచి విషయాలను శ్రద్ధగా వినటం, విన్న విషయాలను సదా మననం చేసుకోవడం, మననంలో ఉన్న విషయాలను తదేక భావన ద్వారా ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడే మనం అనుసరించే భక్తి, భజన, పూజ, ధ్యానం, యోగం ఏదైనా మనని భగవంతుణ్ణి తెలుసుకునేలా చేస్తాయి. అందువలన సాధకులు ఆ దిశగా పయనించడం ద్వారా పరమ సత్యాన్ని చేరుకోవాలి♪.

🌈 సమాధి: 💐

✳️ శరీరాన్ని దాటి వెళ్ళటం సమాధి కాదు. శరీర భావనను దాటటం సమాధి. ప్రాణ స్వరూపులమైన మనకు నిజానికి ఏదీ అవసరంలేదని, అవసరాలన్నీ దేహానివేనని అర్థం కావటమే దేహభావనను దాటటం అంటే. ఆ ప్రాణ భావనలో కర్మలు ఆవిరైపోతాయి. స్పిరిట్ సీసా మూతతీస్తే ఎలా ఆవిరై పోతుందో అలా మనకర్మలు ఆత్మభావనలో ఆవిరైపోతాయి. అందుకే ఆత్మను స్పిరిట్ అంటారు. ఆధ్యాత్మికత అంటే స్పిరిట్ లోని రిచ్యుయల్ కనుకనే అది స్పిరిచ్యుయల్ అయింది. మనసు నామజపంలో లీనమైనప్పుడు ఆ మంత్రం మనం చదవడం లేదని, కేవలం అది మనకు వినపడుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత అది వినపడటం కూడా కేవలం కలలోలాగా భావనేకానీ సత్యంకాదని తెలుస్తుంది. మనలో శబ్దంలేని వినికిడి, రూపమేలేని దృశ్యం జరుగుతున్నాయని సాధనలో దశలవారీగా అనుభవంలోకి వస్తుంది. సత్యావలంబనమే సమాధి. అంటే ఎల్లప్పుడూ లోపలి చైతన్యంతో మనసు కలిసి ఉండటమే సమాధి. మనసును భక్తి ఆవహించటమే సమాధి. పరిపరి విధాలుగా వెళ్ళే మనసును దైవంపైకి ప్రయత్నపూర్వకంగా లగ్నంచేసే ప్రయత్నం సవికల్ప సమాధి. మనసులోని ఆలోచనలను తగ్గించేందుకు మనం చేసే నామజపం సవికల్ప సమాధి అవుతుంది. దైవచింతనలో దేహాన్ని, ప్రపంచాన్ని మరిచి ఉండటం నిర్వికల్ప సమాధి. ఏ చింతనా లేకుండా దేహాన్ని, ప్రపంచాన్ని మరిచిపోవడమే నిద్ర. నిరంతరం చైతన్య భావనతో ఉంటూనే ఈ ప్రపంచంలో జీవనం సాగించడం సహజ సమాధి. భక్తిలో మనసు పొందే తాదాత్మ్యతనే యోగంలో ఉర్ధ్వముఖమైన కుండలినిగా చెప్తారు. కుండలిని శక్తిని చుట్టుకొని ఉన్న పాముతో పోలుస్తారు. పాముతోకను కదిలించినా, తలను కదిలించినా అది బుసకొడుతుంది. అలాగే మనలోని చైతన్య స్రవంతి శరీరమంతా ఒకే విధంగా వ్యాపించి ఉంది. మన శరీరమంతా వ్యాపించి ఉన్న మనసునే యోగంలో కుండలిని అన్నారు. మనసుని తెలుసుకోవడమే సాధనలోని ప్రధాన అంశం.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment