Tuesday, August 27, 2024

 📿  *రక్షానుబంధం*  📿
✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి - "ఏష ధర్మః సనాతనః" నుండి.
🌹💫🌈💫🌈🕉️💫🌈💫🌈🌹

🙏  *రక్షానుబంధం*  🌹

📿 మన పండుగల్లో ప్రకృతి శక్తుల పరిపుష్టి, వివిధ దేవతల అనుగ్రహం, ఆధ్యాత్మిక దృక్పథం, ఆత్మీయతానురాగాల అనుబంధం కలబోసి ఉంటాయి♪.

📿 ఇన్నింటి కలనేతగా వచ్చే పర్వదినాలలో... *'శ్రావణ పూర్ణిమ'* విశిష్టం♪.

📿 వేదమయుడైన శ్రీహయగ్రీవస్వామి ఆవిర్భవించిన పూర్ణిమ (శ్రావణం) నాడు చేసే పవిత్ర కర్మలచే బుద్ధికి సిద్ధి లభిస్తుంది♪. ఆ కారణం చేతనే ఈ రోజున వేదాధ్యయనపరులు ఉపాకర్మలు వంటివి ఆచరిస్తారు♪. దేవతా రాధనకు, ధ్యానానికి అనువైన కాలమిది♪. జగదంబికను పూజించడానికి అనుకూలమైన సమయం♪.

📿 శ్రావణ పూర్ణిమ రక్షాబంధనం ఒక ముఖ్య విషయం♪. ఇందులో సోదరీ సోదరుల ఆత్మీయత తొణికిసలాడుతుంది. ఇంటి ఆడపడుచును మహాలక్ష్మీ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంస్కృతి మనది. తల్లిదండ్రులు పెద్దవారై గతించినా, అన్నదమ్ములు ఆత్మీయంగా "మేము నీకున్నాం. మా ఆప్యాయత, అనుబంధం నీకు అండగా ఉంటాయి” అని ధైర్యమివ్వాలి♪.

📿 అందుకే, ఆడపడుచుల్ని పండుగలకు రప్పించడం, చీర సారెలిచ్చి గౌరవించడం వంటి విధులు మన సంప్రదాయంలో ఉన్నాయి♪. పుట్టింటి ఆత్మీయత స్త్రీకి ఎంతో మనోనిబ్బరాన్నీ, ఉల్లాసాన్ని పెంచుతుంది♪. దానికి కరవులేదని సోదరులు తెలియజేస్తుంటారు♪. ఆడపడుచు మనసు క్షోభపడితే ఇంటికి క్షేమం కాదని కూడా మనవారి విశ్వాసం♪.

📿 తెలుగునాట కొద్దికాలంక్రితం వరకు కార్తిక మాసంలో 'భగినీ హస్త భోజనం’‌ అనేది తప్పనిసరిగా ఉన్న సదాచారం♪.

📿 ఆ రోజున ఎక్కడున్నాసరే అక్కచెల్లెలింటికి వెళ్లి తోబుట్టువు చేతివంట తిని రావాలని సంప్రదాయం♪. ఇటువంటి అందమైన ఆచారాలను యాంత్రిక జీవనపు హోరాహోరీ పరుగుల్లో పడి పోగొట్టుకుంటున్నాం♪. 

📿 మరోవైపు అర్థరహితమైన అనుకరణలతో పాశ్చాత్యులు వాళ్లకు తోచినట్టు జరుపుతున్న ‘దినా’లను మాత్రం ఏ మాత్రం తర్కాన్ని ఉపయోగించకుండా పాటిస్తున్నాం. హద్దుల్ని అతిక్రమిస్తున్నాం♪.

📿 మన భారతీయ ధర్మశాస్త్రాల్లో పేర్కొన్న రక్షాబంధన మహోత్సవం ఈ పూర్ణిమ నాటి ప్రత్యేకత♪.

📿 భారతీయుల ప్రాచీన ధర్మ గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ రోజున సోదరుని తిలకధారణతో, అక్షతలతో అభినందించి సోదరి రక్షా కంకణాన్ని బంధిస్తుంది♪. ఇది దేవతా రక్షగా అతడిని కాపాడుతుంది. బదులుగా సోదరిని కానుకలతో సత్కరిస్తారు♪.

📿 సోదర-సోదరానుబంధానికి పవిత్రమైన, నిర్మలమైన ప్రతీకగా ఆచరించే చక్కని పర్వమిది♪. కుటుంబవ్యవస్థ బలీయంగా ఏర్పడిన భరతభూమిలో బాల్యం నుంచే తోబుట్టువుల చెలిమిని బలపరచి, స్త్రీకి పుట్టింటి అను బంధాన్ని దృఢపరచిన ఈ సంస్కృతిలో సూక్ష్మమైన దేవతాశక్తుల రక్షణను కల్పించిన తపోదృష్టి కూడా దాగి ఉంది♪.

📿 రక్షాబంధనం కట్టేటప్పుడు చదవవలసిన మంత్రం:

“యేన బద్ధోబలీ రాజా దానవేంద్రో మహాబలః|
తేన త్వామభిబధ్నామి రక్ష మాచల మాచల”

💐 “మహాబలుడైన రాక్షసేంద్రుడైన బలిచక్రవర్తిని కట్టిన వానిచే (నారాయణునిచే), నిన్ను కడుతున్నాను. ఓ రక్షా బంధనమా! నువ్వు చలింపకు చలింపకు” దీని భావం♪.

📿 *‘విష్ణు శక్తియే నిన్ను కవచంలా కాపాడుతుంది♪. దృఢంగా రక్షిస్తుంది'* అని దైవశక్తిని ఈ బంధంలో ఆవహింపజేయడమే♪.

📿 ద్రౌపది ఒకనాడు తన సోదరుడైన శ్రీకృష్ణుని వేలికి దెబ్బ తగిలితే వెంటనే వస్త్రంతో కట్టు కట్టిందట. దానికి ప్రతిగా సోదరిని నిండు సభలో కాపాడుకున్నాడు ఆ లీలాసోదరుడు♪. సోదరీ సోదరుల బాంధవ్యానికి ఇదో చక్కని ఉదాహరణ♪.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏  *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏  *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩  *హిందువునని గర్వించు*
🚩  *హిందువుగా జీవించు*


🌹💫🌈💫🌈🕉️💫🌈💫🌈🌹

No comments:

Post a Comment