Friday, August 23, 2024

జాగ్రత్తరా తల్లీ

 *జాగ్రత్తరా తల్లీ*

*క్షణ క్షణం పోరాటమే ఈ జీవితం నేర్చుకో బ్రతికేందుకు చదువొక్కటేనా కర్రసాము కత్తి సామూ ఆత్మరక్షణ కోసం అన్నీ నేర్చుకో...*

దారిలో పూలను చూస్తూ 
పులకరించకు మబ్బులను చూస్తూ తేలిపోకు పక్షులను చూస్తూ ఎగరబోకు.

నేలను ముళ్ళు ఉంటాయ్
కస్సుమని గుచ్చుకుంటాయి
దారంత పొదల మాటున
విషనాగులు దాగుంటాయ్
కాటేయ చూస్తుంటాయ్
కౄర మృగాలుంటాయ్
దాడి చేయ కాచుకుంటాయ్. 

మరి ముఖ్యంగా 
మనుషులుంటారు
గుండె నిండా విషమేదో నిండి ఉంది ఈర్ష్య అసూయా అక్కసు లేవో ముసిరి ఉన్నాయ్.
 
మనిషంటే ప్రేమ స్నేహమనే
ఎరుక మరిచారు
జాగ్రత్త బుజ్జమ్మా.

మరో ముఖ్యమైన సంగతి
నీ చుట్టూ మృగాళ్లు మగాళ్ళు 
ఉన్నారు మనసును
ముక్కలు చేస్తూ మనిషిని ఛిద్రం చేస్తూ మనసుని మనిషిని నిర్దాక్షిణ్యంగా 
చంపేస్తారు.

శవానికిక్కడ ఏ మర్యాదా లేదు
దానికి కులం ఉంది పరపతి ఉంది అందం అర్హతా ఉన్నాయ్
పంట బోదెల్లో చెరుకు తోటల్లో
మామిడి తోపుల్లో వేలాడే శవాలపై సాటి మనిషి స్పందన కరువే.

ఏదేమైనా కాని నువ్
ఆడపిల్లవి కదా
జాగ్రత్త రా చిన్ని
అవసరమైతే చంపేయ్ రా
నిన్ను నువ్ కాపాడుకో
జాగ్రత్త అమ్మా.

ముళ్ళు రాళ్ళూ కౄరమృగాలను
విషసర్పాలను దాటుకొచ్చినా
నిన్ను కమ్ముకునున్న
మగాడిని దాటుకొని రామ్మా

No comments:

Post a Comment