Tuesday, August 27, 2024

 ఒక స్త్రి ఇంటి పని అంతా ముగించుకుని తన భర్త చేస్తున్న కొలిమి వద్దకు ఒక పెద్ద ఇనుపను రోజు మోసుకెళ్ళేది.
దారిలో ఎదురొచ్చిన ముగ్గురు ఆడవాళ్ళు ఆ అమ్మాయిని ఆపి,
నీ భర్త చాలా సోమరి నీదగ్గర పని చేయించుకుంటున్నాడు అంది
మరొక ఆమె నీ భర్త చాలా కఠినాత్ముడు నీతో ఇంత బరువును మోయిస్తున్నాడు అంది.

నువ్వు ఏమీ ఎదురుచెప్పని అమాయకురాలివి. ఇల్లు పిల్లలు అని పని అయ్యాక ఈ పని చేస్తున్నావు. ఇలా కష్టపడి కష్టపడి నువ్వొకరోజు చనిపోతే, నీ భర్త మరొక అమ్మాయిని పెళ్లిచేసుకుని ఉంటాడు.

కుటుంభం కోసం నువ్వింత చేసావని గుర్తుంచుకుంటాడా అని హేళనగ చెబుతూనే నూరిపోసారు.

వారి మాటలకు ఆ అమ్మాయి అవునా నా భర్త సోమరి కాదు నేను ఇప్పుడే అతడిని ఈ ఇనుపను మోయడానికి పంపిస్తాను కాస్త వేచి చూడండి ఇక్కడే అని చెప్పి ఇంటి ముఖం పట్టింది.

వాళ్లు ముగ్గురు ఆ అమ్మాయి భర్త వస్తాడని ఎదురుచూస్తుండగా ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది.

వాళ్లు పగలబడి నవ్వి ఏంటి నీ భర్త రాలేదా, చేయనని చెప్పాడా అని అడిగారు.

అలా ఏం లేదు, నేను వచ్చే హడావిడిలో ఇంటి కిటికీలు వేయడం మరిచాను, ఇక్కడ ఇనుపకు మిమ్మల్ని కాపలాగా పెట్టి ఇంటి కిటికీలు మూసి భద్ర పరచడానికి వెళ్ళాను.

మీరు చెప్పారని నేను ఆయన గొడవ పడలేము.
మా బాధ్యతలు ఏమో మాకు తెలుసు
నా భర్త ఏంటో నాకు తెలుసు.
ఎవరో ఏదో అన్నారని ఆ విషయాలను పట్టించుకోను అంటూ తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయింది.

ఇతరుల విషయాలలో తల దూర్చడం మానేస్తే బాగుంటుంది. లేదంటే ఇలాగే అవమాన పడాల్సి వస్తుంది.
🌹

No comments:

Post a Comment