నమస్తే,
*స్వర్గానికి (దైవలోకానికి) మార్గం చూపించే కధ*
ఒకతను ఎలాగైనా ధనం సంపాదించాలని పట్టుదలతో, చాలా కష్టపడి సుమారు కొన్ని కోట్ల రూపాయిలు సంపాదించాడు. చివరకు వృధ్యాప్యం రానే వచ్చింది.
ఒకరోజు, తాను ఎంతో కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ధనం, తాను చనిపోయినా సరే ఎవరికీ, ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని, తన మరణం తరువాత కూడా ఆ ధనమంతా తనతోనే తీసుకెళ్లడం ఎలా.....అని బాగా ఆలోచించి అతను ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది.
ఏమని అంటే....... , ఎవరైతే నేను చనిపోయిన తరువాత కూడా నా డబ్బు నాతోనే తీసుకొని వెళ్లే సులువైన మార్గం (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు రూపాయలు ఇస్తాను అని ప్రకటన ఇవ్వడం జరిగింది.
నెల గడిచినా ఎవరు రాలేదు. మళ్ళీ అతను 10 కోట్ల నుంచి ఏకంగా 100 కోట్లు ఇస్తాను అని మళ్ళీ ప్రకటన ఇచ్చినా ఒక్కరు కూడా రావడం లేదు. దానితో చాలా బెంగతో, చిక్కి సగం అయిపోతుండగా.... అంతలో ఒక మహా జ్ఞాని అయిన ఒక స్వామీజీ అతనికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో బసచేస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి స్వామీజీకి తనకున్న కోరికను తెలపడం జరిగింది.
అదివిన్న స్వామీజీ నవ్వుతూ.......
నేను మీ డబ్బు మీరు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువైన మార్గం (టెక్నిక్) చెపుతాను" అనగానే, "ఎలా ?" అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.
దానికి స్వామీజీ కోటీశ్వరుడిని "మీరు అమెరికా, ఇంగ్లండ్, జపాన్ వెళ్ళారా ?" అని ప్రశ్నించడంతో...,,"అవును వెళ్ళాను" అని అతను అనగానే....."అమెరికాలో మీరు ఎన్ని రూపాయలు ఖర్చు చేశారు" అని స్వామీజీ అడిగాడు. అందుకు కోటీశ్వరుడు "స్వామీజీ 'అమెరికా'లో నా రూపాయలు చెల్లవు
కనుక నా రూపాయలను #డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను. అదే 'ఇంగ్లాండ్' ఆయితే #పౌండ్స్, 'జపాన్' ఆయితే #ఎన్స్
ఇలా ఏదేశం వెళ్తే, ఆ దేశ ధనం (కరెన్సీ) క్రింద నా రూపాయలను మార్చి, ఖర్చు చేయడానికి తీసుకొని వెళ్తాను" అని అన్నాడు.
అప్పుడు ఆ జ్ఞాని..."ఓ కోటీశ్వరుడా.....! నువ్వు బ్రతికి ఉండగా ఎలా దేశ పర్యటనలు చేసావో.... అలాగే నీవు చనిపోయిన తరువాత నీ ఆత్మ కూడా పరలోక యాత్రలు చేయటం జరుగును.
అలా నీ డబ్బు నీతో రావాలంటే, ఒకవేళ నీవు #నరకానికి వెళ్ళాలి..... అని అనుకుంటే నీడబ్బును పాపం చేయు పనుల లోనికి మార్చు కోవాలి. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనులలోనికి మార్చు కోవాలన్నమాట...!
లేదా..... ఒక వేళ నీవు #దేవలోకానికి (స్వర్గం) వెళ్లాలంటే, నీ డబ్బును దైవ కార్యక్రమంలకు, ముక్తి మార్గంలకు (Divine and Enlightened path) ఉపయోగపడే విధంగా
చేసి, సేవ చేసి పుణ్యంగా మార్పిడి (ఎక్స్చేంజ్) చేయుము" అని కోటీశ్వరుడితో, స్వామీజీ చెప్పడం జరిగింది.
ఆ మాటలకు ధనవంతునికి జ్ఞానోదయం కలిగి, తనకు సులువైన మార్గం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకొని, ఆ 100 కోట్ల ధనాన్ని స్వామీజీ (ట్రస్ట్) కి ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆనాటి నుండి జ్ఞానోదయం కలిగిన ఆ ధనవంతుడు, తన ఆస్తిని ఆ జ్ఞాని సలహాతో సంపదనంతా సన్మార్గంలో (Divine and Enlightened path) ఖర్చు చేసి, సేవ చేసి పాప కర్మలు నచించి మంచి #కర్మఫలం (SATHKARMA)
వలన దేవ లోకాలకు వెళ్లడం జరిగింది.
*నీతి:-
మన సంపదలు మనతో వచ్చే విధానం ఇదే...., కావున మనం కష్టపడి సంపాదించినది దైవిక మరియు ముక్తి మార్గం కొరకు
ఖర్చు చేసి, సేవ చేసి పుణ్యంగా (Sathkarma) మార్చి మనతో తీసుకొని స్వర్గంకు వెల్దామా ?*
లేక చెడు వ్యసనాలకి, పాపపు పనులకు, ఇతరులకు హని కలిగించే పనులు చేసి చెడు కర్మలు (Bad karma) తీసుకుని నరకానికి వెల్దామా......!!?*
No comments:
Post a Comment