*🌺☘శ్రీ రామకృష్ణుల బోధ: భక్తుడు: కర్మ యోగం అంటే ఏమిటి? స్వామీ! శ్రీ రామకృష్ణులు: నీకు ఇష్టం ఉన్నా,లేకున్నా నీ స్వభావమే నిన్ను పనులను చేయిస్తుంది. అందుచేతనే అనాసక్తతతో పనులను చేయమని చెబుతారు. అనాసక్తతతో పని చేయడం అంటే ఫలితం పై ఆసక్తి లేకుండా చేయడమే. ఉదాహరణకు, పూజ,జపం,తపస్సు అన్నీ చేస్తున్నావనుకో, జనం మనల్ని ప్రశంసిస్తారు అని లేక పుణ్యం సంపాదించడం కోసం వాటిని చేయకూడదు. ఈ విధంగా అనాసక్తతతో పని చేయడమే కర్మ యోగం! శ్రీ రామకృష్ణ పరమహంస.*🪷✍️
No comments:
Post a Comment