*""ఆత్మశుద్ధి ....!!*
*"మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే మనసు నిర్మలంగా ఉండాలి."*🙏🙏🙏
*"ఐహిక చింతన ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది."*
*"దీనికి ఉదాహరణగా ఒక కథ."*
*"ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది."*
*"ఇంతలో ఆ సీసా మూత వేసి వేయడం జరిగింది."*
*"అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది."*
*"మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించ సాగింది."*
*"అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పు సీసా మూత తీయడం జరిగింది.వెంటనే బ్రతికేనురా జీవుడా అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది."*
*"కాని సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది."*
*"ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంట బడింది."*
*"వెంటనే ఆ చీమ “ఏం మిత్రమా! అలా అయిపోయేవు? క్షేమమేనా?” అని అడిగింది. “ఏం క్షేమం?అంతా క్షామమే” అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది."*
*"అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది."*
*"చిత్రం! ఆ మొదటి చీమ అతి మధురమైన పంచదారనే వెగటుగా ఉంది అంది.రెండవ చీమకు ఆశ్చర్యమేసింది."*
*"కారణం అంతుబట్టలేదు. ఎందుకైనా మంచిదని మొదటి చీమను నోటిని తెరవమని అందులో ఉన్న ఉప్పు కణాలను తీసివేసింది."*
*"అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు."*
*"అలాగే మనిషిలో అరిషడ్వర్గాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది."*
*"ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం."*
🕉️ *సర్వేజనా సుఖినోభవంతు* 🕉️
No comments:
Post a Comment