Tuesday, August 27, 2024

 *🌹🌹🌹🌹   బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే.   🌹🌹🌹🌹*

          *విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే..*

        *గంజాయి మొక్కలలో పెరిగినా తులసి దైవ స్వరూపమే.*

            *జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు.*

             *పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాసరే.. మనకు మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం.*

        *అదే సదా ఆచరణీయం.!*

            *ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు" మా అబ్బాయి చాలా మంచోడండి కానీ ఫ్రెండ్స్ వల్లే పాడైపోతున్నాడు" అని.*

          *ఇంకొంతమంది " మా అమ్మాయి చాలా మంచిదండి కానీ పరిస్థితుల వల్ల అలా ప్రవర్తిస్తుంది"  అంటారు.*

            *కానీ నిజానికి మనుషుల వల్ల పరిస్థితి వల్ల మారేది నిజమైన వ్యక్తిత్వం కాదు ఇది మనమందరం గుర్తుపెట్టుకోవాలి.*

            *మనం ఎక్కడున్నా,  ఎవరితో ఉన్నా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగినప్పుడు నిజమైనటువంటి సన్మార్గంలో ప్రయాణించగలుగుతాం.*

           *చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇదే నేర్పించాలి. ఒక గిన్నెలో పాలు,  నీళ్లు ఎంతలా కలిపి పెట్టినా హంస పాలని మాత్రమే తాగి నీళ్లను వదిలేస్తుంది.*

             *అంటే ఒక్క చిన్న జీవికి ఉన్న విచక్షణా జ్ఞానం మనిషికి ఎందుకు ఉండడం లేదు? అంటే మనిషికి మంచి చెడు రెండూ ఎదురైనప్పుడు చెడును స్వీకరించినంతగా మంచిని స్వీకరించడం లేదు.*

              *దానికి కారణం ఏంటో తెలుసా అతని మనసు అతని ఆధీనంలో లేదు. కాబట్టి మీ మనసుని మీ ఆధీనంలో పెట్టుకోండి. అప్పుడు అన్ని శుభ పరిణామాలే జరుగుతాయి..*

             *మన మనసు మన అధీనంలో ఉండాలంటే ఎంతో కొంత భగవనామస్మరణ అవసరం. యోగా, ధ్యానం అవసరం..*

          *ఒక్కసారి ప్రాతఃకాలాన్నే  నిద్ర లేచి,  ధ్యానం చేసి చూడండి..*

             *యోగ ప్రయత్నించండి.*

             *మీ మనసు మీ ఆధీనంలోకి రాకపోతే అప్పుడు అడగండి. మనసు ఆధీనంలో ఉంటే అన్నీ మన దగ్గర ఉన్నట్టే..ఏమంటారు.*

           *ప్రయత్నించండి,  ఆనందంగా జీవించండి...*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

No comments:

Post a Comment