డెంగ్యూ మరియు ఇతర విష జ్వరాలకు ఈ రసం వరం లాంటిది..
▪️బొప్పాయి ఆకుల రసం..
డెంగ్యూ వచ్చిన వారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల త్వరగా కోలుకుంటారు. బొప్పాయి ఆకులు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద పరంగా డెంగ్యూకు బొప్పాయి ఆకులు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. కనుక ఈ ఆకుల నుంచి జ్యూస్ తయారు చేసి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
▪️ఎంత మోతాదులో తాగాలంటే..
ఈ ఆకులను కొన్ని తీసుకుని శుభ్రంగా కడిగి వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని పెద్దలు అయితే రోజుకు 10 నుంచి 15 ఎంఎల్ మోతాదులో, పిల్లలు అయితే రోజుకు 5 ఎంఎల్ మోతాదులో తాగాలి.
▪️మరీ ఎక్కువగా తాగకూడదు..
బొప్పాయి ఆకుల రసాన్ని మోతాదులో మాత్రమే తాగాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా తాగితే వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొందరికి విరేచనాలు కూడా అవచ్చు. కనుక ఈ ఆకుల రసాన్ని మోతాదులో మాత్రమే సేవించాలి.
▪️మరిన్ని ఉపయోగాలు:-
బొప్నాయి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఎలాంటి జ్వరాన్నయినా సరే తగ్గిస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు సైతం ఉంటాయి. అందువల్ల శరీరంలోని నొప్పులు సైతం తగ్గుతాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లివర్ పెరగడం, జీర్ణక్రియ మందగించడం, శరీరంలో వాపులు వంటి వ్యాధులు ఉన్నవారు కూడా బొప్పాయి ఆకుల రసాన్ని రోజూ తాగాలి.
ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. Venkatesh 9392857411.
No comments:
Post a Comment