Friday, August 30, 2024

మాయ అంటే ఇదేనేమో...... దీనిని ఎలా దాటాలో.....

 

Home
Shorts
You

divine planet - Designing lives with divinity.
27 minutes ago
🌹గుడ్ మార్నింగ్ 🌹జీవితం  కర్మల అంటే పనుల వలయం. కర్మ చేయక తప్పదు. చిత్రమేమిటంటే కర్మ నుండి కర్మ పుడుతూ ఎప్పటికీ మనను కర్మలలో కట్టి పడేస్తుంది. ప్రతి కర్మ - ఫలితాన్ని తెచ్చి తప్పక అనుభవించేలా చేస్తుంది. నేను శరీరము అనుకున్నంత కాలము ఈ కర్మలు - కర్మ ఫలానుభావాలు తప్పవు. ఒక్క ఆత్మ జ్ఞానమే మనిషిని - శరీర భావనను దాటించి - వేరు భావనను దాటించి -ఏకత్వ భావనను అర్ధమయ్యేలా చెబుతూ - నువ్వు శరీరానివి కాదు - అనంత ఆత్మ శక్తివి అనే ఏకత్వ స్థితికి చేరుస్తుంది. ఒక్క ఆత్మ జ్ఞాన మార్గములో తప్ప మనిషికి కర్మ విముక్తి లేదు. కర్మ విముక్తి కలిగితే తప్ప శరీర, మనో పరమైన సుఖదుఃఖ అనుభవాలు తప్పవు.ముక్తి, మోక్షము అంటే శరీర నేను అన్న కర్మ వలలో నుండి బయటకు రావడమే. ఇది మహిమలతో మాయలతో అయ్యేది కాదు. కేవలం మన స్వీయ చదువైన ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన చదువు చదువుకొని - నూటికి నూరు మార్కులతో పాస్ అయిన వారికే ఈ శరీరము తన భ్రమను తొలగిస్తుంది.చిత్రమేమిటంటే ఎవరికీ ఈ ఆత్మజ్ఞాన చదువు ఇష్టముండదు. దైవాన్ని కూడా శరీర పరమైన విధముగానే భావించుకుంటూ, కోరుకుంటూ వాడుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాము. మాయ అంటే ఇదేనేమో...... దీనిని ఎలా దాటాలో.....🌹god bless you 🌹

No comments:

Post a Comment