Friday, August 30, 2024

 

_*నీ పిలుపే*_
*_తెలుగుకు గెలుపు..!_*
++++++++++++++++++
      *గిడుగు జయంతి*
           29.08.1863
✍️✍️✍️✍️✍️✍️✍️
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
         విజయనగరం
        9948546286
💐💐💐💐💐💐💐💐

భాష ఆయన గుండె ఘోష..
అమ్మ గర్భాలయంలో
నవమాసాల 
*_మాతృభాష కోర్సును_* 
పూర్తిచేసి బయటికొచ్చాక
ఆ అమ్మకే 
అమ్మభాష నేర్పిన 
నిఖార్సు తెలుగోడు..
నీ భాష నీ గుండెని తట్టాలన్నా..
అక్కడి భావాలను వెతికిపట్టాలన్నా 
గ్రాంధికం నీ మాధ్యమం..
వ్యవహారికమే నీ ఉద్యమం..
అన్న గిడుగు..
ఈరోజున 
*_నీ భాషా సంస్కృతికి గొడుగు!_*

తెలుగు మాత్రమే చదివి 
ఊరుకోని గిడుగు..
మరిన్ని భాషలు నుడివి
ఎన్నో భాషల 
సారమ్ము తెలిసి..
మాతృభాష సొగసు 
గని మురిసి..
వ్యావహారికాన్ని వ్యాప్తి చేసి
తెలుగు పొద్దుకు 
తానే వేగుచుక్కై..
*_తెలుగు జాతికి_*
*_తానే పెద్దదిక్కై..!_*

ఎక్కడుంటే అక్కడే పోరు..
మాతృభాష కోసం ఆతృత...
గ్రాంధికమ్ము నెత్తిన పిడుగు
వ్యవహార భాషోద్యమ 
స్థాపక ఘనుడు గిడుగు
చదివితివా..నేర్చితివా
అంటే నీ చదువు 
అక్కడే ఆగిపోతుందని..
నీకొచ్చిన భాషే 
నీ యవ్వారం..
అదే నీ చదువుల సారం..
ఇలా చేసి ఉద్బోధ..
*_తీర్చాడు తెలుగోడి బాధ!_*

గుండె రగిలే భావానికి..
కడుపు మండే ఆకలికి..
ఒళ్లు మరిచే ఉద్వేగానికి..
ఆకాశం లాంటి ఆవేశానికి..
నీ వ్యక్తీకరణ..
*_నీ భాషలోనే_*
*_ధృవీకరణ.._*
ఎవరి సులువు 
వారి వాడుక భాషే..!
అంతేనా..ఆనాడు తెలుగోడి
గుండెల్లో రగిలిన స్వరాజ్యకాంక్ష..
స్వరాష్ట్ర పిపాస..
దిక్కులు పిక్కటిల్లగ
చెప్పాలంటే 
నువ్వు  నేర్చిన సొంత బాస..
నువ్వు మెచ్చిన నీ యాస..
అది నీకే వర్తింపు...
దాంతోనే తెలుగుకు గుర్తింపు..!
ఇదంతా గిడుగు తెగింపు..
*_నీ భాష తెనుగింపు..!_*

_తేట తేనియల తెల్లని_ 
_పాల మీగడ గిడుగు.._
_కూరి తెలుగు భాషకు_
_గొడుగు గిడుగు..!_
ఆయన తెలుగు సరస్వతి
నోముల పంట...
ఆయన వాదం అర్థం కాక 
తెలుగు వారికి 
ఎంత కష్టం
ఎంత నష్టం..!
*_ఇది పెద్దల మాట.._*
*_తేనెల మూట..!!!_*

వ్యావహారిక భాషోద్యమ
పితామహుడు 
గిడుగు రామ్మూర్తి
జయంతి సందర్భంగా
అక్షర ప్రణామాలు..
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment