ప్రతి ఒక్క తల్లీ, తండ్రి, అన్నా, తమ్ముడు,అక్క, చెల్లి ఆలోచించాల్సిన సమయం ఇది.... 🙏
స్త్రీలపై అఘాయిత్యాలు జరగడానికి ప్రధాన కారణలు :
1) న్యాయ వ్యవస్థలో లోపాలు, కేసుల విచారణలో తీవ్ర జాప్యం...తప్పు చేసినప్పుడు వెంటనే కఠినమైన శిక్ష ఉంటుందనే భయం నేరస్తులలో లేక పోవడం.
2) చిన్న వయసులోనే పిల్లలు అస్లీల వెబ్ సైట్స్ లకు అలవాటు పడడం..
3) సినిమాలు, టీవీ సీరియల్స్ లలో తప్పుడు సందేశాలు, నేరపూరిత కధలు, ఎలాంటి మోరల్స్ లేకపోవడం,
4) " తెర మీది హీరోలు " ఎలాంటి సామాజిక బాధ్యత లేకుండా కేవలం డబ్బులకు " కక్కుర్తి " పడి చెత్త సినిమాలు తీయడం.
అనేక నేరాలకు ఈ అంశాలు ప్రాధమిక కారణాలని వివిధ పరిశీలనల్లో తేలింది...
స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, సినిమాలు, టీవీ సీరియల్స్ కంటెంట్ పై కఠిన నియంత్రణ అవసరం.
చట్టాల్లో కఠిన శిక్షలతో పాటు హిందూ సంప్రదాయలు, మంచిని ప్రోత్సహించడం అవసరం...
సినిమాల్లో, ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో చెడు ప్రచారం జరుగుతున్నంత కాలం
స్త్రీలకు రక్షణ ఉండదు.
అత్యాచారాలు , హత్యలు తదితర సంఘటనలు జరిగినప్పుడు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, బంద్ లు చేయడం ఆ తర్వాత కొన్ని రోజులకు మర్చిపోవడం మనకు సాధారణo అయింది...☺️
ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం కావాలి..... కఠిన శిక్షలు అమలు కావాలి.🙏🚩
No comments:
Post a Comment