Sunday, August 25, 2024

 🙏🏻 *రమణోదయం* 🙏🏻

*ఇతర తలపులు లేవగానే వాటిని పూర్తి చేయటానికి ప్రయత్నించక, అవి ఎవరికి కలిగాయని తనను విచారించుటయే చేయదగినది.* 

             ఇదంతా ఇల్యూషన్
(భ్రమ..భ్రాంతి..మాయ)అని
ఉండడమే "సొల్యూషన్"

*ఆ తలపులన్నీ నాకే కదా కలుగుతున్నాయి!  "నేను ఎవరు?" అని విచారణ చేస్తే మనస్సు తాను పుట్టిన స్థానానికే తిరిగి వెడుతుంది. ఎగసిన తలపులు కూడా అణగిపోతాయి.*  

*నిత్యం సాధన ("ఆత్మ విచారణ") చేయగా చేయగా చిత్తశుద్ధి కలిగి, విచారణ ప్రారంభించగానే మనస్సు వెంటనే హృదయంలో నిల్చి ఉండటం అత్యంత సులభమైపోతుంది.*

*కానన దహన సమయంలో, ఆ తీక్షణమైన వేడిని భరించలేక ప్రాణులు దగ్ధమైనట్లు ఉధృతంగా సాగే "ఆత్మవిచారణ" తాపాన్ని ప్రతిఘటించలేక, హృదయంలో దాగియున్న వాసనలు తలపుల రూపంలో బయటికి వచ్చి వెనువెంటనే విచారాగ్నికి ఆహుతి అయి చివరికి వాసనలన్ని పూర్తిగా నశిస్తాయి.*

🙏🏻 *భగవాన్ శ్రీరమణ మహర్షి*🙏🏻

(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.400)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి... 

*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం!?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment