Sunday, August 25, 2024

 రామాయణమ్. 37
...
నా రాముడంటే మీకెందుకంత ఇష్టం ? దశరధుడు తన మంత్రి,సామంత,పురోహితులను అడిగాడు! 
నిర్ణయం తీసుకునే ముందు! 
..
రాముడు కనపడగానే
వారి మాటలు మరొక్కసారి ఆయన మనసులో ప్రత్యక్షమై మనసును ఆనందంతో నింపివేసినవి .
.
నారాముడు సర్వలోక మనోహరుడు!
.
రామునిగురించి సభలో వ్యక్తమయిన అభిప్రాయాలు ఇవి !.
.
ప్రజాసుఖత్వే చన్ద్రస్య ..సుఖముకలిగించుటలో చంద్రసమానుడు
.
వసుధాయా క్షమాగుణైః.. ఓర్పు మొదలైన గుణములలో పృధ్వీసమానుడు.
.
బుధ్యాబృహస్పతేత్తుల్యో...బుద్ధిలో దేవగురువు బృహస్పతి సమానుడు
.
వీర్యే సాక్షాచ్ఛచీపతే.. పరాక్రమంలో సాక్షాత్తూ దేవేంద్రడే!
.
ధర్మజ్ఞః ..ధర్మములెరిగినవాడు
.
సత్యసన్ధశ్చ..సత్య ప్రతిజ్ఞకలవాడు
.
శీలవాన్.. శీలవంతుడు
.
అనసూయకః.. అసూయలేనివాడు
.
క్షాన్తః.. ఓర్పుకలవాడు
.
సాన్త్వయితః.. కష్టాలలో ఉన్నవారిని ఓదార్చువాడు
.
శ్లక్ష్ణః.. మృదుస్వభావి
.
కృతజ్ఞః.. ఎవరైనా మేలు చేస్తే మరువని వాడు
.
విజితేన్ద్రియః..ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనేవాడు.
.
రాముడికి కోపం కలిగినా అనుగ్రహము కలిగినా అవి వ్యర్ధములుగావు .
.
చంపదగినవానిని చంపితీరుతాడు ,చంపతగని వారి విషయములో అసలు కోపము వహించడు! 
.
ఎవడినైతే అనుగ్రహించాడో వాడు ఈ లోకంలో అందరికన్నా ఐశ్వర్యవంతుడవుతాడు! 
.
రామమ్ ఇన్దీవరశ్యామమ్ సర్వశత్రు నిబర్హణమ్....నల్లకలువవలే ఉండే రాముడు శత్రుసంహారకుడు!
.
అసలిన్నెందుకు! లోకంలోని శ్రేష్టమైన గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి అని అడిగితే అందరి చూపుడు వేలు రాముడివైపు తిరుగుతుందట!
.
ఇన్ని ఆలోచనలు మదిలో తిరుగుతూ వున్న దశరధమహారాజు ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు " రామవర్మాహం అహంభో అభివాదయే" అన్న రాముని మాటలతో!.
.
రామా ! పుష్యమీ నక్షత్రగడియలలో నిన్ను యౌవరాజ్యపట్టాభిషిక్తుడిని గావింప నిశ్చయించాను ! 
.
రామా ! నీవు ఇకనుండి ఇంకా జాగ్రత్తగా మెలగవలె !
.
నీవు ఇంకా వినయవంతుడవై ఎల్లప్పుడును ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని కామము వలన కలిగే వ్యసనములకు ,, క్రోధము వలన కలిగే వ్యసనములకు దూరంగా ఉండు,
.
 ధాన్యాగారాలను ,ఆయుధాగారాలనూ ఎల్లప్పుడూ చక్కగా నింపి ఉంచు. 
.
ప్రజలను,అమాత్యులను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచు! .
.
 అని హితవు పలికాడు దశరధమహారాజు
.
ఇంత సంతోషకరమైన వార్తను కౌసల్యా దేవి కి చేరవేశారు రాముని మిత్రులు..
.
N.B
.
మన స్మృతులు ఈ విధంగా చెపుతున్నాయి
.
కామము వలన కలిగే వ్యసనములు..పది..అవి
.
వేట , జూదము ,పగటినిద్ర ,పరుల దోషాలు వినడం చెప్పడం  ,
పరస్త్రీ సంభోగము  ,తాగుడు ,నృత్యము ,గీతము ,వాద్యము , పనీపాటలేకుండ దేశసంచారము చేయడం ఇవ్వన్నీ వ్యసనాలే .
BE MERRY BE HAPPY CULTURE ..
.
ఇక కోపం వలన కలిగే వ్యసనాలు
.
చాడీలు చెప్పడం complaining mentality
సత్పురుషులను బంధించడం ,బాధించడం
ద్రోహము, ఈర్ష్య ,అసూయ ,ప్రక్కవాడి డబ్బు కాజేయడం ,వాక్పారుష్యమ్ అనగా ఊరకే ఎదుటివాడిని తిట్టిపోయడం  , దండపారుష్యమ్ అనగా ఎదుటివాడిని కొట్టటం.
.
వీటన్నిటికీ దూరంగా ఉండమని హితవు పలుకుతున్నాడు దశరధుడు ! 
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

No comments:

Post a Comment