*వాస్తవ విషయాలు*
(ఒక కథగా....)
➖➖➖➖➖➖
*ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.*
*మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ*
*"ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.*
*ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?*
*"ఎందుకు అలా అనిపిస్తోంది?" అడిగాను*
*"అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని . కానీ ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు*
*అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.*
*ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు. కానీ నేను సంతోషంగా లేను*
*వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు*
*చివరికి నా మిత్రుడు డాక్టర్ సురేష్ చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది*
*ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది*
*మీ కోసం ఆ వివరాలు :*
*మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు*
1. *ఎండార్ఫిన్స్, Endorphins,*
2. *డోపామిన్, Dopamine,*
3. *సెరిటోనిన్... Serotonin,*
4. *ఆక్సిటోసిన్..... Oxytocin.*
*ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది.*
*ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం*
*⭕Endorphins:⭕*
*మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి*
*అప్పుడు మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins*
*నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియ నిర్వహిస్తారు.*
*"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల*
*ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, వీడియో లు చూస్తూ ఉండండి.*
*⭕2. Dopamine:⭕*
*నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము*
*ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు*
*ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది.*
*అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం*
*కాబట్టి మిత్రులారా !*
*షాపింగ్ బడ్జెట్ పెంచండి.*
లేదా
*పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు కాదు కదా!*
*⭕3. Serotonin:⭕*
*ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ విడుదల అవుతుంది*
*మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది*
*ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?*
1. *స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం*
*(వాళ్లకి ఆనందం కలగడం కోసం మాత్రమే ... అంతే తప్ప వాళ్ళు ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా...)*
2. *మొక్కలు నాటడం..*
3. *రోడ్ల గుంతలు పూడ్చడం*
4. *రక్త దానం..*
5. *అనాధ ప్రేత సంస్కారం..*
6. *అనాధ సేవ..*
7. *యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.*
8. *మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం*
*ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది*
*⭕4. Oxytocin:⭕*
*ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది*
*స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది (ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది)*
*మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ*
*అలాగే కరచాలనం*
*సినిమా ఆక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే !*
*గుర్తుకు తెచ్చుకోండి . మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.*
*ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది*
*అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా*
*అందుచేత*
*👉మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము👈*
1. *✴️Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి వ్యాయామం చేద్దాము*
2. *✴️Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము*
*మగవారికి ప్రత్యేకం*
1. *వంటను రోజూ మెచ్చుకోండి (నేను తిట్లు తినేది ఇందుకే)*
2. *డ్రెస్ మెచ్చుకోండి*
3. *మేకప్ మెచ్చుకోండి*
*ఆడవారికి ప్రత్యేకం*
1. *గుర్రు పెట్టారని తిట్టకండి*
2. *కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి*
3. *మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి*
3. *✴️Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి*
*ఏడాదికి ఒక మొక్కను నాటండి.*
*ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి*
*పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి*
4. *✴️ఆక్సిటోసిన్ కోసం ఇంతో వాళ్ళని hug చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉంటె హగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా !*
*అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులనూ కూడా హగ్ చేసుకునే అలవాటు చేసుకోండి*
*ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి* 😁
*పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం*
1. *గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి*
- *⚜️Endorphins⚜️*
2. *వాళ్ళు సాధించిన దానికి పొగడండి*
- *⚜️Dopamine⚜️*
3. *పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి*
- *⚜️Serotonin⚜️*
4. *దగ్గరకు తీసుకోండి*
- *⚜️Oxytocin⚜️*
*Have a Happy Life*.
No comments:
Post a Comment