Friday, August 30, 2024

🌺 *జై శ్రీమన్నారాయణ* 🌺
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
       *మన మంచితనం మనల్ని కాపాడుతుంది*
ధనము వలన సౌకర్యాలు కలుగుతాయి కానీ ఆనందం శాంతి లభించదు. మంచి భార్య లేదా మంచి భర్త మంచి పిల్లలు మంచి కుటుంబం మంచి స్నేహితులు ఆనందకరమైన జీవితం కలగాలంటే ధనము కంటే ఎక్కువ పుణ్యమే ఉండాలి.. ధనము పది పర్సెంట్ ఉంటే పుణ్యం 20% ఉండాలి..
 అలా ఉంటేనే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం మనకు ఉంటుంది.. ఒకవేళ పాప పెర్సెంట్ ఎక్కువగా ఉంది అంటే ఇబ్బందికరమైన భర్త లేక భార్య, బాధించే సంతానం, మోసం చేసే స్నేహితులు, ద్వేషించే బంధువులు, ఆత్మీయత అనురాగం లేని జీవితం,
 రోగాలు, శత్రువులతోని మానసిక సంక్షోభంతోని మన జీవితం సాగుతుంది..అదే పుణ్యం ఉంటే ఆనందంగా ఉంటుంది..
 ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం కానీ, పుణ్యం సంపాదించడానికి ప్రయత్నం చేయం.. పుణ్యం వలన సకల శాంతి కలుగుతుంది..
  
🌸 **చిన్న కథ** 🌸

*ఒక వ్యక్తి ప్రతి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. ‘మనం కూడా ఇలా చేయాలి’ అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో  కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ‘మనం ఎలాగూ పూజ చేయలేము, ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం’ అని అనుకున్నాడు.*

*కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది. ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో... "అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు. నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి  వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో... “నాయనా నేను చెప్పేవరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు!” అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.*

*రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావు అని అడగగా రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి “నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను.” అని అన్నాడు.*

*ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ‘ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?’ అని అడిగినప్పుడు రాహువు... అయ్యా మీరు ఇన్నిరోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు” అని రాహువు చెప్పగానే... బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా “అతడికి దానం ఇస్తున్నాను” అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైంది.*

*ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడడమా మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా ? దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా?*

*బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి “ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి!” అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు*

*ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచం మంచి పనులు చేయండి.*
 *మనము చేసే సామాజిక సేవ, మానసిక సేవ, ఆధ్యాత్మిక సేవ, మనల్ని తప్పకుండా రక్షిస్తుంది* 
 **సేకరణ:- నమిలకొండ.రమణాచార్యులు..
తిరుమల నగర్ రోడ్ నెంబర్ 3 కరీంనగర్ 9440072364...

No comments:

Post a Comment