🌹good మార్నింగ్ 🌹మనసుకు మంచి చెడులు తెలియవు. మనము ఏ విధముగానైనా గ్రహించిన ప్రతి విషయము మనసుగా అంటే జ్ఞాపకముగా మారిపోతుంది. మనసుకు సత్యము తనకు తెలిసినదే. మనసు శరీరాన్ని నడుపుతుంది. కనుక మనసుకు సంబంధించిన సత్యాలే శరీర సత్యాలు.కనుక విషయాలు తెలుసుకునేటప్పుడే - పంచెంద్రియముల ద్వారా గ్రహించే టప్పుడే జాగ్రత్తగా తెలుసుకోవాలి. అవసరంలేనివి ఊరికినే, సరదాకి, తోచక కాలక్షేపానికి తెలుసుకున్నా అవి లోపల మనసై - మనసుకు శరీరానికి సత్యాలై కూర్చుంటాయి. కనుక జాగ్రత్త లోపలకు స్వీకరించండి.
మనలో ఉన్న బుద్ది - విచక్షణ అనే జ్ఞానము మంచి చెడుల వివరము చెబుతూ ఉంటుంది. అది బలముగా వుండాలంటే జ్ఞాన సంభంధ మంచి విషయాలు, శరీర, మనో ధర్మాలకు సంబంధించిన మంచి విషయాలు, మనకు, సృష్టికి లేక విశ్వానికి సంబంధించిన దైవశక్తి లేక ఆత్మ శక్తికి సంబంధించిన ఆత్మ జ్ఞాన సత్యాలు తెలుసుకుంటే బుద్ధి బలపడి - మనసును శరీరాన్ని అసత్యము, అజ్ఞానము, అధర్మము, చెడులోకి వెళ్లకుండా ఆపి - కేవలం మంచిలోనే ఉంచగలుగుతుంది.
జ్ఞానము బుద్ధికి బలము - విషయాలు, కోరికలు, ఆశలు, ఇలాంటివి అన్నీ మనసుకు బలము. బుద్ది బలము - మనసును,శరీరాన్ని మంచిలో నడిపిస్తుంది. మనోబలము గ్రహించిన అన్నీ సత్యమని భావించటం చేత - మంచితో పాటు చెడును కూడా చేయిస్తుంది... మనసుకు విచక్షణ అనే జ్ఞానము లేదు. శరీరము పనిముట్టు మాత్రమే - అది మనసు లేకుండా పని చేయలేదు. బుద్ధి మనసును అదుపుచేయగలిగితేనే - మనసు, శరీరము మంచిలో నడుస్తాయి. లేకపోతే గుడ్డివాడు వాహనము నడుపుతున్నట్లే. కళ్ళు నిజమైన చూపు కాదు - జ్ఞానమే నిజమైన చూపు. అందుకే జ్ఞాన నేత్రము అనే పదము ఆధ్యాత్మికతలో మహాత్ములు వాడారు. జ్ఞాన నేత్రము అంటే బుద్ది యొక్క పరిపూర్ణ, సంపూర్ణ అవగాహనతో గ్రహించటం, పనిచేయటం, జీవించటం. సృష్టి మనిషికి మాత్రమే ఇచ్చిన జ్ఞానాన్ని వాడండి. జ్ఞాన జీవనమే ఆధ్యాత్మికత. 🌹god bless you 🌹
No comments:
Post a Comment