[8/12, 11:46] +91 73963 92086: చలాచల బోధ:--
శ్రద్ధ: ఏదైనా ఒక పని మీద ఆసక్తి కలిగి ఆ పనిని, లక్ష్యాన్ని ప్రేమిస్తూ ఆ పని తప్ప వేరే యే పని మీద ఆలోచించకుండా అనుకున్న పనిని మధ్యలో ఆపకుండా, పట్టుదలతో సంపూర్ణం చేయడము.సత్సంకల్పంతో చేపట్టిన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడాన్ని శ్రద్ధ అని అంటారు.అలాగే జ్ఞాన సముపార్జన కోసం ఆసక్తి కలిగి, పట్టుదలతో, నిర్విఘ్నంగా పూర్తి చేయడాన్ని శ్రద్ధ అని అంటారు."శ్రద్ధవాన్ లభతే జ్ఞానం"అని శాస్త్రం చెబుతోంది.
పితరులకు పిండ ప్రధానం చేయడంలో ఆ పితరులపై ప్రేమ, శ్రద్ధ ఉండాలి.అప్పుడే ఆ క్రతువును శ్రాద్ధం అని అంటారు.
జ్ఞానం కోసం ఇటువంటి శ్రద్ధ ఉండాలంటే మనకు బ్రహ్మ విద్య నేర్పే గురువు పట్ల ఆ గురువు అనుభవజ్ఞులు అనియు,శిష్యుడైన తనను తప్పక ఉద్ధరిస్తారని అచంచలమైన విశ్వాసం ఉండాలి.అటువంటి గురువునకు భక్తితో సమర్పణ కావాలి.అప్పుడే శ్రద్ధ కుదురుతుంది.
[8/12, 11:46] +91 73963 92086: అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు? ఆతడు సమర్ధుడైన గురువేనని సాధకుడు ఏ విధంగా కనుగొంటాడు?ఒక అజ్ఞాని జ్ఞాన వృద్ధుడైన గురువును పరీక్షించ గలడా? లేకపోతే కపట గురువు దొరికితే,ఆ గురువును భక్తి విశ్వాసాలతో సేవిస్తే ఏమవుతుంది?ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడం ఎలా? దీనికి సమాధానమేమనగా ఎప్పుడైతే ఒక గురువు వద్దకు పోగానే మన మనసులో అలజడి పోయి ప్రశాంతత లభిస్తుందో మరియు గురువును ప్రశ్నించకుండానే మనకు సమాధానం దొరుకుతుందో, అటువంటి గురువే నిజమైన గురువు అని సాధకుడు నిశ్చయించుకోవాలి.ఆ తరువాత ఆ గురువును విశ్వసించి గురుభక్తితో సమీపించి తన మోక్షేచ్ఛను వ్యక్తం చేయాలి.తనకు విద్య నేర్పి,తరింపజేయాలని ప్రార్థించాలి.
ఏ సాధకుడైతే తనను తాను గురువునకు అర్పణ చేసుకొని, తగిన విధంగా శిక్షణ గరపి,అవసరమైతే శిక్షింపబడటానికి అంగీకరించి ఉంటాడో అతనినే శిష్యుడు అని అంటారు.ఇది శిష్యుడు అనే పదమునకు నిర్వచనము.
తరువాత షట్క సంపత్తిలో ఆరవది, చివరిది 'సమాధానము'.
సశేషం.
No comments:
Post a Comment