Sunday, April 20, 2025

 *పురుషులందు రిటైరైన పురుషులు వేరయా!*
                    🌹🌹🌹

1)పదవి విరమించునాడు
 ప్రశంశించుదురు  పలువురు
మరునాడు నుండి
 పెదవి విరుతురు ప్రతి ఒక్కరు.

2)గేటు తీయరెవరు
గది తలుపు దీయరు
లోనికి రమ్మనకపోగా 
తలుపుకడ్డము నిలిచెదరు 
తుదకు కూర్చోమనరెవరూ
పైగా పవరులేని వానిగా 
పరిగణింతురందరు

3)పింఛెనొచ్చు వరకు 
పెండ్లాము పలుకరించదు
వచ్చినాక తక్కువని 
సన్నాయి నొక్కులునొక్కుచుండు
ఏమి సేతునమ్మ
నిర్మలా సీతారావమ్మా? 

4)పదే పదే సెలవులిచ్చుకొను
 పనిమనిషి సైతము
*పనీ పాటా* లేని వాడని 
పదే పదే పరిహాసపు లుక్కు లిచ్చు !

5)రిటైరైనాక 
పగవాని వోలె
ఎదురైన ప్రియమిత్రుడుసైతము
 పళ్ళికిలించుచు జూచు!

6) సతి నాఫీసు కడ 
డ్రాపు చేసినను... లేదా...
పికప్ చేసికున్నను
పరమ జాలిగ చూచెదరు
ఆమె కొలీగులు!

7) నిన్న మొన్నటి వరకు
 *గుడ్డు మార్నింగు* చెప్పినవారు 
 కనబడిననూ చూడనట్లు
 *గుడ్డివారులా* పోవుచుందురు.

8) పదవి వీడిన నాడు 
కప్పిరి శాలువలెన్నో పోటీపడి 
ఇచ్చిరి భగవద్గీత ప్రతులు
ప్రేమ ఒలకబోసి!

9)వచ్చిన శాలువలు 
ఇచ్చిన గీతా మకరందములు
ముసుగు కప్పుకుని 
పఠించుటయే...
ఇక పై తక్షణ కర్తవ్యము.

10)ఇంతేలే రిటైరైనోళ్ళబతుకులు 
 ఇవి ఏనాటికీ బాగుపడని అతుకులు 
ఇంతేనయా! తెలుసుకోవయా!
ఈ లోకం సంగతి ఇంతేనయా!
రిటైరైనాక బతుకింతేనయా !

(*సరదాగా నవ్వుకోవడానికి వ్రాసిందే ! ఎవరినీ నొప్పించేందుకు కాదు సుమా!!*)

                    😁😁😁

No comments:

Post a Comment