Sunday, April 20, 2025



 అరసవల్లి మూలమూర్తిపై కిరణస్పర్శ (3 రోజులు) :

మహా భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం అరసవల్లి. ద్వాపరయుగంలో సూర్యుడిక్కడ ఇంద్రప్రతిష్ఠగా వెలిశాడు. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అన్న ప్రమాణాన్ని అనుసరించి.... అరసవల్లి సూర్యనారాయణమూర్తిని అర్చిస్తే నేత్ర, చర్మ వ్యాధులు, ఇతర మొండివ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు. ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే సంతాన, ఆరోగ్య, విద్యా లాభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఏడాదికి రెండు సార్లుస్వామి వారిని స్పృశించే సూర్య కిరణోత్సవం అరసవల్లిఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి సూర్య గమనంలో వచ్చే మార్పుల వల్ల ప్రతిఏటా మార్చి, అక్టోబర్ మాసాల్లో అరసవల్లిస్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలికిరణాలు తాకుతాయి. ఇది భారతీయుల వాస్తుశిల్ప విజ్ఞానపు ఔన్నత్యానికి తార్కాణం. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

No comments:

Post a Comment