Thursday, July 10, 2025

 [7/9, 07:34] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


రక్తిలేని పనులు రమ్యమై యుండునా?
రక్తికలిగెనేని రాజు మెచ్చు
రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు
విశ్వదాభిరామ వినురవేమ!


*భావం:-*

మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి.
[7/9, 07:34] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*అంగడమ్మ  అంగడి*

అంగడమ్మ  అంగడి
ఆదివారం  అంగడి
కొత్త  కుండల  అంగడి
కొత్త  చీరల  అంగడి
కాయగూరల  అంగడి
కసిరికాయల  అంగడి
మా  ఊరి  అంగడి
మామిడి  కాయల  అంగడి
అమ్మలక్కల  అంగడి
అక్కబావల  అంగడి
అంగట్లో  బేరము  
భలే  భలే  బేరము
అంగడమ్మ అంగడి  
ఆదివారం  అంగడి
[7/9, 07:34] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులు లేరు, శత్రువులూ లేరు. మన మాట, మనస్తత్వం, ప్రవర్తనలతో ఎదుటివారిని స్నేహితులుగానో, శత్రువులుగానో మార్చుకుంటాం.*
[7/9, 07:34] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*అచ్చు పోసిన ఆబోతువలె*


గతంలో కొన్ని పల్లెల్లో ఒక కోడెను ఇది ఆబోతు అని పేరు పెట్టి వూరి మీదకు వదిలి పెడతారు. అది అందరిదీను. అది ఎక్కడ తిరిగినా..... ఎవరింటికి వెళ్ళినా దానిని ఏమీ అనరు. ఇది ఆనాటి ఆచారము. ఏపనీ లేకుండా ఊరు మీద పడి తిరిగే వారిని ఈ సామెతతో పోల్చి చెపుతుంటారు.
[7/9, 07:34] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*ఒంటు పక్కన సున్నా*


స్వతహాగా కాకుండా ఎవరి సహాయం తోనైనా విలువను పెంచుకొనే వ్యక్తి.ఒంటు అంటే అంకె.అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నాలు పెట్టినా విలువ ఉండదు.ఒంటుకు కుడివైపున ఏ ఒక్క అంకె వేసినా, లేదంటే ఒక్క సున్నా పెట్టినా దాని విలువ అధికమౌతుంటుంది.
[7/9, 07:34] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*


*తెలివైన గాడిద*


రామాపురం గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు గాడిద మేతమేస్తు చూసుకోకుండా ఒక ఎండిపోయిన నూతిలో పడిపోయింది. గాడిద కి దెబ్బలు తగిలి చాలా బాధ పడింది. అలా గంటలు గడిచాయి. చివరకు గాడిద మూలుగు విని రైతు దానిని గుర్తించాడు. 

అది ముసలి ది అవ్వడం మూలన ఇక బయటకు తీసి ప్రయోజనం లేదు అని అనుకునీ గాడిడతో పాటు నూతిని కూడా కప్పి వేద్దాం అనుకున్నాడు.

అందుకు అతడు ఇరుగు పొరుగు వారిని పిలిచి మట్టితో కప్పడం మొదలుపెట్టాడు. అందరూ తలా కొంచెం  వేసిన మట్టి గాడిదమీద పడడం మొదలుఅయ్యింది. మొదట అక్కడ జరుగుతున్న విషయం గాడిదకు అర్దం అయ్యి బోరున ఎడవడం మొదలుపెట్టింది. తరువాత నిశ్శబ్దంగా ఉండి ఆలోచించం మొదలుపెట్టింది.

కొంత మట్టివేసిన తరువాత గాడిద చేస్తున్న పనిని చూసి రైతు అవక్కూ అయ్యాడు. దానిమీద పడిన మట్టిని దులుపుకొని కొత్త మట్టిపై నిలుచునేది.

అలా ప్రతిసారీ వేసిన మట్టిని దులుపుకొని, నిండిన మట్టి పై కొత్త అడుగు వేసి నిలుచునేది.
చివరకు నూతి నీిండే టప్పటికి బయటకు వచ్చేసి, ప్రాణాలతో బయట పడింది.

*💎నీతి:*

*జీవితంలో బరువులు, బాధ్యతలు, కష్టాలు అనే మట్టి మనమీద ఎప్పుడూ పడుతునేవుంటుంది.*

 *దానిని నీ తెలివితేటలతో విదు లించుకొని కొత్త అడుగు తీసుకోవాలి కానీ అగిపోకూడదు.*
[7/9, 07:34] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*


*🍀ఆకులు రంగులు మారుస్తాయా? Do leaves change colors?☘️*

చెట్ల ఆకులు రంగులు మార్చవు . అప్పుడే పుట్టిన ఆకులు(చిగురాకులు) లేత ఆకుపచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఆ తర్వాత పూర్తి ఆకుపచ్చగా మారుతాయి. అయితే ఇది రంగు మార్చుకోవడము కాదు . లేత ఆకు తన మీద కీటకాలు దాడిచేసి తినకుండా వుండేందుకు చేసుకున్న ఏర్పాటు . ఆ ఎరుపు రంగును కీటకాలు గుర్తించలేవు . లేత ఆకుల్లో ఉండేటటువంటి ఒక రకమైన రసాయనము దానిని రుచిలేని ఆకుగా మారుస్తాయి. పైగా లేత ఆకుల్లో పత్రహరితము కాక " ఎంథోసైనిన్‌ " అనే వర్ణకము అధికముగా ఉండి ఎరుపు రంగును ఇస్తుంది. ఈ వర్ణకము సూర్యుడి ఎండతీవ్రతకు లేత ఆకు మాడకుండా రక్షిస్తుంది.

No comments:

Post a Comment