[7/5, 07:41] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
ఎన్ని చట్టములలో నున్నగాని,
చెడ్డవా రెల్లవేళల సిగ్గు మాలి
చట్టముల కెదురీతకే సాహసింప
సంఘ నియమాలు దాటరు సజ్జనాళి
*భావము :*
చెడ్డవారు ఎల్లప్పుడు సిగ్గువిడిచి చట్టాన్ని ఎదిరించటానికి సిద్ధపడతారు. మంచివారు సంఘనియమాలు దాటరు.
[7/5, 07:41] +91 79819 72004: *🤘 నేటి సుభాషితం🤘*
*ఎప్పుడూ నవ్వుతూ ఉండు. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ నీకన్నా అందంగా ఉండరు.*
[7/5, 07:41] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అక్కరకు రానిది అవనిలో లేదు*
ప్రతి వస్తువు కూడా పనివచ్చేదే అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. (శ్రీ శ్రీ కవితలోని కొన్ని మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు: అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకనర్హం.... .....)
[7/5, 07:41] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*భలే భలే*
అమ్మ చేతి గోరుముద్దలు
తింటూ ఉంటే భలే భలే
నాన్న వీపు మీద ఎక్కి
ఊగుతూ ఉంటే భలే తాతయ్య చెప్పి తీపి కబురులు
వింటూ ఉంటే భలే భలే
అమ్మమ్మ చెప్పే కమ్మని కథలు
బజ్జోని వింటే భలే భలే
*రచన : డాక్టర్ ఎం. హరి కిషన్*
[7/5, 07:41] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*
*అజ్ఞానం*
మౌల్వీ నజీరుద్దీన్ చాలా గ్రంథాలు చదివి అపార జ్ఞానం సంపాదించాడు. కానీ అసలు జ్ఞానం కావాలంటే అది జీవితం నుండే నేర్చుకోవాలన్నది అతని ఉద్దేశ్యం. అందుకే ప్రజలను కలుసుకునే వీలుండే పనేదైనా చేస్తే జీవిత సత్యాలు తెలుస్తాయని, అన్వేషణ ఆరంభించాడు.
నజీరుద్దీన్‌కి ఈత బాగా తెలుసు. అందువల్ల పడవ నడిపే పని బావుంటుందని, దానిలో చేరాడు. రోజూ నదికి అటూ ఇటూ మనుషుల్ని పడవపై చేరవేయడం అతని పని.
ఒకరోజు అతని పడవలో ఒక ముసలి గురువు ఎక్కాడు. ప్రయాణిస్తుండగా మాటా మాటా కలిసి, ఆ గురువు ఒక మహా పండితుడని తెలిసింది. మౌల్వీ నజీరుద్దీన్ తన పేరు చెప్పకుండా, తన గురించి తెలియనివ్వకుండా ఉన్నాడు.
కొద్దిసేపటికి వర్షం ప్రారంభమైంది. "నీకు వర్షం ఎలా కురుస్తుందో తెలుసా?" అని అడిగాడు గురువు.
"నాకు తెలియదు " అన్నాడు నజీరుద్దీన్.
"వర్షం ఎలా కురుస్తుందో తెలియకపోతే నీ సగం జీవితం వ్యర్థం" అన్నాడు గురువు ఎగతాళిగా.
"అవునా గురువుగారూ? మరెలా?" అని అడిగాడు అమాయకంగా.
"ఇంకేముంది? నువ్వు సగం చచ్చినవాడితో సమానం" అన్నాడు గురువు. ఇంతలో వర్షం ఎక్కువైంది. పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. అలలు పెద్దవై పడవ అటూ ఇటూ ఊగడం మొదలెట్టింది.
"గురువుగారూ! మీకు ఈత వచ్చా?" అని అడిగాడు నజీరుద్దీన్. అప్పటికే భయం భయంగా వణుకుతున్న గురువు "రాదు" అన్నాడు.
"అయితే మీ పూర్తి జీవితం వ్యర్థం " అని నజీరుద్దీన్ పడవలో నుండి నీటిలోకి దూకి, ఈదుకుంటూ వెళ్లిపోయాడు.
[7/5, 07:41] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*
*🟥వాటికి పసుపు రంగు ఇష్టమా?, Do they like yellow color?🪳*
మనం చూడగలిగినట్టు ప్రాణులన్నీ వివిధ రంగులను చూడలేవు. బొద్దింకలు (కాక్రోచ్) పసుపు రంగును చూడలేవు. ఎందుకంటే వాటి కళ్లలో ఆ రంగు పౌనఃపున్యానికి స్పందించే కణాలు ఉండవు. అందువల్ల వాటికి పసుపు రంగు నలుపుగా కనిపిస్తుంది. అందువల్లనే పసుపు రంగు గాజు పెట్టెను అవి చీకటి ప్రాంతంగా భ్రమించి అక్కడ క్షేమంగా దాక్కోవచ్చనే భావనతో అందులోకి చేరుకుంటాయి. అందుకనే ఆ రకమైన పెట్టెలను వాటికి బోను (trap)ల్లాగా ఉపయోగించి వాటి బెడదను వదిలించుకుంటారు.
[7/5, 07:41] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*ఐరావతం*
మోయలేని భారం
దేవేంద్రుడి వాహనం ఐరావతం. ఇది తెల్ల ఏనుగు. ఇది దైవంతొ సమానం. దీని చేత పనులు చేయించ కూడదు. అయినా మంచి ఆహారం పెట్టాలి. అది మోయ లేని భారం.
No comments:
Post a Comment