Saturday, July 5, 2025

 *తల్లితండ్రులకు చెప్పకుండా ఎవరో మధ్యలో పరిచయం అయిన ఒక అనామకుడిని నమ్మి వెళ్ళిపోయిన ఒక కూతురికి నాదొక సూటి ప్రశ్న.*

*నీ ప్రేమ ఎలా గొప్పది?*

*రక్త మాంసాలు కడుపున మోస్తూ నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ*

*సమయం అయ్యింది నన్నింక బయటకు వదలమని నువ్వు ఆ కడుపులో కాళ్లతో తంతుంటే*
*ఆ బాధను కనురెప్పలు దాటకుండా దాచి*
*నీకోసం తన ప్రాణాలకు తెగించి శంకరా నేను చచ్చినా పర్వాలేదు* *నా బిడ్డను బ్రతికించు అని నీకు జన్మనిచ్చిన.*
*ఆ అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా.?*
*నువు పుట్టిన క్షణం నుంచి నీకోసం ఆలోచిస్తూ*
*నువ్వు ఎక్కడ అడుగు వేస్తె అక్కడ నీ పాదం కింద తన* *అరచేతిని పెడుతూపెడుతూ నీకు బాధ వేస్తె తన బాధగా భరిస్తూ*
*నీకు కష్టం వస్తే తన కష్టంగా మోస్తూ*
*ఎండనకా వాననకా కష్టపడుతూ నీకోసం తన జీవితాన్ని కరిగిస్తూ...*

*నువ్వు ఏది అడిగినా కాదనకా తన స్వేదాన్ని నీ సంతోషంగా మారుస్తూ.*
*అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని అనుక్షణం ని గురించి తపించే*
*ఆ నాన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?*
*నీ ప్రేమ ఎలా గొప్పది??*

*" నీ నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా ఇంత చేసిన తల్లిదండ్రుల ప్రేమ కంటే... నీ నుంచి ఏదేదో ఆశించేవాడి ప్రేమ గొప్పదా?"*

*4 రోజుల క్రితం మా ఇంటి దగ్గర జరిగిన ఒక విషయం ఇది.*
*(ప్రేమ పేరుతో ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో* *వెళ్ళిపోయిన(లేచిపోయిన అనడం సమంజసం ఏమో) కూతుర్ని తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ అమ్మనాన్నలు.*
*బయటకు వస్తే నీ కూతురు ఎక్కడ అని ఇరుగుపొరుగు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక బయటకు రాను భయపడి విలపిస్తున్న ఆ అమ్మానాన్నలు.*
*ఎవరైనా దగ్గరి ఆత్మీయులు ఓదార్చటానికి వెళ్తే, నా గుండెలపై ఎక్కించుకొని పెంచానయ్య నా బిడ్డను అని చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ నాన్న బాధను.*
*తలుపు చప్పుడు వస్తే నా బిడ్డ వచ్చింది అని పిచ్చి ఆశతో వెళ్లి చూసి ఏడుస్తున్న ఆ అమ్మ పడే ఆవేదనను. చూశాక మనసు చలించి.నేను అడిగిన సూటి ప్రశ్న ఇది*
*అమ్మాయిలూ. ఇంటినుంచి బయటకు వెళ్ళే ముందు ఒక్క క్షణం మీ అమ్మనాన్నల గురించి ఆలోచించండి.*

   *ఇది చదివాక అందరూ మారకున్న ఒక్కరైనా ఆలోచిస్తారని ఆశిస్తూ....🙏*

No comments:

Post a Comment