రాజు గారి అరవై ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేసాడు."రాబోయే పున్నమి రోజు 'నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను " ఇది రాజు గారి ప్రకటన.
పున్నమి రోజు రానే వచ్చింది .జనం తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు .అందరూ రాజు గారు అడిగే ప్రశ్నలకోసంఎదురు చుాడ సాగారు.రాజుగారు ఇలా చెప్పారు.
"మహారాణి గారికి గుత్తి వంకాయ కుార తినాలనిపించింది.వెంటనే వంట వాడిని పిలిపించింది.' కుారలో మసాలా బాగావెయ్యి,గుత్తివంకాయకుార ఘుమ ఘుమలాడుతుా వుండాలి" అని చెప్పింది .వంటవాడు రంగంలోకి దిగాడు .సన్నెకల్లు మీద మసాలా నుారు తున్నాడు.కుార వండకముందే మసాలా గుభాళించేస్తుంది..
వంటవాడి కుాతురు ఉయ్యాల లో పడుకొని నిద్ర లేచి ఏడుస్తుంది.పొయ్యి దగ్గర ఉన్న నీళ్ళ గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు.ఆ నీళ్ళు పడి మంటలు ఆరు తున్నాయి .అది చుాసిన వంట వాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది .
దీన్ని వంటవాడి భార్య చుాసింది." ఓరేయ్ ! నీకు పొయ్యి దగ్గర ఏమి పనిరా?పొయ్యి లో పడ్డావంటే నీకు చావు ముాడుతుంది."అని వాణ్ణి పట్టుకొని దుారంగా లాగింది.ఎలాగైతేనేం గుత్తివంకాయ కుార తయారు అయిపోయింది .దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానందపడిపోయింది.సంతోషం పట్టలేక ఆమె వంటవాడ్ని పిలిపించి .కొన్ని బంగారు కాసులు బహుమానం గా ఇచ్చింది .అని కధ చెప్పడం ముగించారు." కధ విన్నారుగా! రాణివారు వంట వాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ?
ఇది ప్రశ్న . సమాధానం కధలోనే వుంది .ఎవరు జవాబు చెపుతారో చెప్పండి." అన్నాడు రాజు..
పండితులు అంతా తల లు గొక్కున్నారు.జవాబు ను ఒక్కరైనా ఊహించలేకపోయారు.ఆ ఊరిలో ఒక బాలిక కుాడా ఈ కధ ను విన్నది." రాజుగారు దీనికి జవాబు నేను చెపుతాను అని చేతులు ఊపింది.జవాబు చెప్పమన్నారు మహారాజు .మహారాజ! రాణిగారిచ్చిన కాసులు వెయ్యి నుాట పదహారు."
శభాష్ !! ఖచ్చితంగా చెప్పావమ్మా అని ఆ బాలికను దగ్గరకు తీసుకున్నాడు మహారాజు.తన పక్కన సింహాసనం లో కుార్చోబెట్టుకున్నాడు.
ఎలా చెప్పగలిగావు చిన్నారీ!అని అడిగారు మహారాజు.."జవాబు ఈ కధలోనే వుంది మహారాజా! మసాలా వెయ్యి లో " వెయ్యి " వుంది .నుారుతున్నాడు లో నుారు వుంది .ఏడుస్తుంది లో ఏడువుంది.ఆరుతున్నాయి లో ఆరు వుంది .ముాడుతుంది లో ముాడువుంది.మెుత్తం కలిపితే ' వెయ్యి నుాట పదహారు అని జవాబు వస్తుంది .అని చెప్పింది బాలిక.జనం చప్పట్లతో ఆ చిన్నారీ బాలికను అభినందించారు…!!
No comments:
Post a Comment