Saturday, July 5, 2025

 *చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మరచిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో*...

*ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు, మన నుండి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఆ తరువాత మనం  ఏమిటో ఒక సారి ఆలోచన చేసుకో*...

*అబద్ధంతో స్నేహాం చేసి, మోసానికి బానిసగా మారిపోయి. నిజాయితీ అనే గొప్ప నాయకత్వలక్షణాన్ని మలినంచేసి సాధించే దాన్ని విజయమంటారో ,లేక వినాశనం అంటారో ,నువ్వే గమనించుకో*...

*కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. కష్టం తరువాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖం తరువాత వచ్చే కష్టం భరించలేనిది*...

*పరిచయం అందరితోనూ ఉన్నా,స్నేహం కొందరితోనే ఉంటుంది. బంధం మాత్రం అర్థం చేసుకునే మనసున్న వారితోనే నిలబడు తుంది*. *ఆశించడం నమ్మడం తప్పు ఎప్పుడూ కాదు,తేడా ఒకటే.* 
*ఎవరిని నమ్మాలి, ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించాలి అనేది నిర్ణయించటం, సరైన వ్యక్తుల నుంచి సరైనది ఆశించకపోతే ఫలితం ఉండదు*...

*మన జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరెవరో ఏదేదో అన్నారని బాధ పడ కూడదు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు*...

*నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చు కోవలసినది తడ బడటంకాదు,నిలబడటం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం*…

      🌹🙏*ప్రేమతో మీ ఆత్మబందువు... అపర్ణగోపినాయుడు. యాస*🙏🌹

No comments:

Post a Comment