టిఫిన్ సెంటర్ "అల్లం చట్నీ" ఇంట్లోనే ఇలా చేసుకోండి! - పక్కా కొలతలతో 3 నెలలు నిల్వ ఉంటుంది!
టిఫిన్ సెంటర్లలో ఇడ్లీ, దోసెల్లోకి ఇచ్చే అల్లం పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. పుల్లగా, కారంగా, తియ్యగా ఎంతో రుచిగా నోరూరిస్తుంది. ఇంట్లో కూడా ఇలాంటి పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే టిఫిన్లతోపాటు సమయం లేనపుడు అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇవాళ పక్కొ కొలతలతో అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఇలా ట్రై చేయండి :
అల్లం, బెల్లం, చింతపండు అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి.
చింతపండు బాగా ఉడికించి తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు :
అల్లం - 50 గ్రాములు
బెల్లం - 50 గ్రాములు
చింతపండు - 50 గ్రాములు
మెంతులు - 1 టీ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
నూనె - 150 గ్రాములు
ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి శనగ పప్పు - 1 టేబుల్ స్పూన్
మినపగుండ్లు - 1 టేబుల్ స్పూన్
వెల్లులి రెబ్బలు - 10
ఎండు మిర్చి - 5
ఇంగువ - పావు టీ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - 2 టేబుల్ స్పూన్లు
కారం- 4 టేబుల్ స్పూన్లు
పసుపు - పావు టీ స్పూన్
అల్లం పచ్చడి తయారీ విధానం :
ముందుగా అల్లం శుభ్రం చేసి పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. తడిపోయేలా 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది.
50 గ్రాముల అల్లంలోకి 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఒక వేళ మీరు 100 గ్రాముల అల్లం తీసుకుంటే 100గ్రాముల చింతపండు అవసరం ఉంటుంది. ఇపుడు చింతపండును పీచు, పిక్కలు లేకుండా శుభ్రం చేసుకుని 150 ఎంఎల్ నీళ్లు పోసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.
ఈ లోగా చింతపండు మెత్తబడిపోతుంది. ఇపుడు పొయ్యి మీద నుంచి పక్కకు పెటుకుని మరో వైపు కడాయిలో మెంతులు లో ఫ్లేమ్ లో ఎర్రగా వేయించి ఉడికించిన చింతపండులో వేసుకుని చల్లార్చుకోవాలి.
ఇపుడు అదే కడాయిలో నూనె వేసుకుని కట్ చేసి తడి ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా కాకుండా 3 నిమిషాలు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇపుడు అదే కడాయిలో మిగిలిన నూనెలో ఆవాలు, పచ్చి పప్పు, మినపగుండ్లు ఎర్రగా వేయించాలి. వేగిన తర్వాత 10 వెల్లులి రెబ్బలు, 5 ఎండు మిర్చి, పావు టీ స్పూన్ ఇంగువతోపాటు చివరిగా కరివేపాకు వేసుకుని మంట ఆర్పేసి చల్లారనివ్వాలి.
ఇపుడు మిక్సీ జార్లో ఉడికించి చల్లార్చుకున్న చింతపండు గుజ్జు, ఫ్రై చేసిన అల్లం ముక్కలు ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ నుంచి తీసిన పాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇపుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, బెల్లం తురుము, పసుపు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేస్తే చాలా మెత్తగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని పోపులో కలుపుకుంటే చాలు.
No comments:
Post a Comment