Saturday, July 5, 2025

 [7/4, 16:41] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్
సఫలములగు ననుచు సంతసించి,
కానిపనులకు దమ కర్మ మటందురు
విశ్వదాభిరామ వినురవేమ!


*భావం:-*

మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు.
[7/4, 16:41] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*స్వాతంత్ర్యం అంటే బానిసత్వం నుంచి విడుదలే కాదు, కుల, సాంఘిక అసమానతలను తొలగించడం, మత వైషమ్యాలను నశింప జేయడం. - సుభాష్ చంద్రబోస్*
[7/4, 16:41] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*అమ్మకొక ముద్ద*


ఆకేసి ఉప్పేసి
పప్పేసి అన్నం పెట్టి
చారేసి నెయ్యివోసి

అమ్మకొక ముద్ద
చెల్లికొక ముద్ద
అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద
తాతకొక ముద్ద

అందరికి పెట్టి
నువ్వు తిని
నేనూ తిని

ఆకెత్తేసి ఆకేసి వక్కేసి
సంతకు పోయే దారేది
అత్తారింటికి దారేది??
[7/4, 16:41] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు*


ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండటం. పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పటం.
[7/4, 16:41] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*ఐదు పది కావటం*


ఓడిపోవటం రెండు చేతుల్నీ ఒక చోటికి చేర్చినమస్కారం పెట్టడం అనేది ఓడిపోవటానికి, పారిపోవటానికి, లొంగిపోవటం లేదా మర్యాదపూర్వకంగా దండం పెట్టడాన్ని ఇలా అంటారు.
[7/4, 16:41] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*


*వరహాలవాన*

*(సంయుక్త అక్షరాలు లేని కథ)* 

- పునః కథనం: డా.ఎం.హరికిషన్ - 9441032212 - కర్నూలు
*******************************
      కందనవోలు అనే వూరికి ఒకరోజు ఒక సాధువు వచ్చాడు. ఆయనకు అనేకమయిన మహిమలు వున్నాయి. దాంతో ఆ వూరి జనాలంతా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ధనసహాయం చేయమని అడగసాగారు. కానీ ఒక ముసలాయన వచ్చి “సామీ... మా ఊరిలో రెండు ఏళ్ళ నుండీ వానలు సరిగ్గా లేవు. కరువుతో అల్లాడిపోతున్నాం. వానలు కురిపించండి చాలు" అన్నాడు.
సాధువు జనాల వైపు తిరిగి “మీకు వానలు కావాలా, బంగారు వరహాలు కావాలా" అని అడిగాడు. ఒక్క ముసలాయన తప్ప అందరూ వరహాలే కావాలన్నారు. సాధువు చిరునవ్వు నవ్వి "నీటి కన్నా విలువయినది ఏదీ లేదు. నీళ్ళుంటే అన్ని సంపాదించుకోవచ్చు. కాకపోతే కొంచం పని చేయాలి. మరొక్కసారి ఆలోచించుకోండి" అన్నాడు. జనాలు ఈసారి కూడా తమకు “బంగారు వరహాలే కావాలి" అన్నారు.
“సరే అయితే... రేపు వరహాల వాన పడుతుంది. కానీ మళ్ళీ ఎప్పటికీ మామూలు వాన పడదు. సరేనా" అన్నాడు. అందరూ సంతోషంగా “సరే... సరే... " అన్నారు. సాధువు ఆకాశం వైపు చూసి, చేతిని గాలిలో ఆడించి “రేపు తెల్లవారగానే వరహాల వాన పడుతుంది. పోండి" అని చెప్పాడు.
జనాలంతా ఇళ్ళకు తిరిగి వచ్చారు. ఆరోజు ఎవరికీ నిదురపట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూడసాగారు. తెల్లవారగానే సాధువు చెప్పినట్టే వరహాల వాన కురవడం మొదలు పెట్టింది. జనాలంతా దొరికినేవి దొరికినట్టు ఏరుకోని ఇళ్ళల్లో, పెట్టెల్లో నింపుకోసాగారు. అవి నిండగానే బిందెల్లో, బానల్లో వున్న నీళ్ళన్నీ పారేసి వాటిని కూడా బంగారంతో నింపుకున్నారు. ఇళ్ళల్లో వుండే తినుబండారాలన్నీ బైట పడేసి సంచుల నిండా, గదుల నిండా అంతా వరహాలతో నింపేసుకున్నారు.
వరహాల వాన పడతానే వుంది. చెరువులు బావులు అన్నీ వరహాలతో నిండిపోయాయి. వీధులన్నీ వరహాలతో నిండిపోయాయి. 
ఊరిలోని జంతువులు జనాలు ఇళ్ళ బయట పారేసిన ఆహారాన్నంతా తిని, హాయిగా నీటిని తాగేశాయి.
జనాలంతా ఆ వరహాలను చూసి సంతోషంగా వున్నారు. నెమ్మదిగా చీకటిపోయి వెలుతురు రాసాగింది. గంటగంటకీ ఎండ పెరుగుతా వుంది. అందరికీ నాలుకలు తడారిపోతా వున్నాయి. ఆకలయితావుంది. తిందామంటే తిండిలేదు. తాగుదామంటే నీళ్ళులేవు. ఎక్కడ చూసినా వరహాలే. కానీ వాటిని ఏం చేసుకోవాలో తెలియ లేదు. అమ్ముదామంటే కొనేవారు లేరు. అందరూ అన్నీ పాడేశారు. పక్క దేశాలకు పోదామంటే దారులన్నీ మూసుకుపోయాయి.
పిల్లలు, పెద్దలు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరూ తిండిలేక, నీళ్ళు లేక ఒకొక్కరే పడిపోసాగారు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. వానను కోరుకోకుండా వరహాలను కోరుకున్నందుకు బాధపడ్డారు. అందరూ కళ్ళనీళ్ళు బెట్టుకోని సాధువు దగ్గరికి పోయారు. "సామీ... మాకు ఈ బంగారం, వరహాలు ఏవీ అక్కరలేదు. సమయానికి సరిగ్గా వానలు పడితే చాలు. పనిచేసి మేమే అవన్నీ కొనుక్కోగలం. ఈ ఒక్కసారికి మా అందరిని మన్నించండి" అన్నారు.
అప్పుడు సాధువు చిరునవ్వు నవ్వి వారిని కాపాడమని దేవున్ని వేడుకొన్నాడు. వెంటనే ఆ వరహాలన్నీ మాయమైపోయాయి. కాసేపటికే భూమి తడిసి ముద్ద ముద్ద అయిపోయేటట్టు,
దోనెలు కారేటట్టు, పిల్ల కాలువలు ఉరుకులాడేటట్టు మంచి వాన కురిసింది. ఆరోజు నుండీ ఆ వూరి జనాలు ఆశకు పోకుండా... పొలం పనులు చేసుకుంటూ... వచ్చిందానితో సుఖంగా గడపసాగారు.
*******************************
డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 9441032212
*******************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
[7/4, 16:41] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*


*🟥క్లోనింగ్ ప్రయోగము మనుషులపైన ఏ దేశములోనైనా చేసారా? Do cloning experimented on humans?*

ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.

ఒక కణం నుండి కేంద్రకాన్ని తొలగించి, దానిని, కేంద్రకం క్రియా రహితం చేయబడిన లేదా తొలగించిన వేరొక ఫలదీకరణం చెందని అండకణం లోనికి ప్రవేశ పెట్టే ప్రక్రియ క్లోనింగ్. క్లోనింగ్ రెండు విధాలుగా ఉంటుంది:

*ప్రత్యుత్పాదక క్లోనింగ్ :* కొంత విభజన తరువాత అండకణాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టినపుడు అది దాత కేంద్రకంతో జన్యుపరంగా సారూప్యత కలిగిన పిండంగా అభివృద్ధి చెందుతుంది.

*చికిత్సాయుత క్లోనింగ్ :* అండాన్ని రాతి గిన్నె (పెట్రి డిష్ )లో ఉంచినపుడు అనేక రుగ్మతలపై ప్రభావ వంతంగా పనిచేసే పిండ మూలకణాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి రోగాల చికిత్సలకు ఉపయోగిస్తారు .

1997 లో రోస్లిన్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఇయన్ విల్ముట్ తన సహచరులతో కలిసి గొర్రె క్షీర గ్రంధుల నుండి డాలీ అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా విజయవంతంగా సృష్టించినపుడు ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది. డాలీని సృష్టించిన ప్రక్రియ లోనే మానవ క్లోనింగ్ కూడా సాధ్యమేనని చాలా మంది భావించారు. ఇది నైతిక వివాదాలను సృష్టించింది. ఇటువంటి క్లోనింగ్ మనుషులమీద చేస్తే ఎక్కువకాలము బతకరనీ , త్వరగా చనిపోతారనీ, ఇది చాలా అపాయకరమైన ప్రయోగమని , చెయ్యవద్దని " విల్ మట్ " స్పష్టముగా చెప్పారు . ఈ హ్యూమం క్లోనింగ్ ని అమెరికా , బ్రిటన్‌ వంటి దేశాలు నిషేదించడమే కాదు ... ఇటువంటి ప్రయోగాలు మానవజాతిపట్ల జరిగే అపచారం , హత్యతో సమానం అని అన్నారు

No comments:

Post a Comment