[7/2, 16:39] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
ఎట్టి బాధలు కటువుగా నేర్పడినను
యున్నతపు లక్ష్యమే మది యుండినపుడు
కష్ట భూయిష్ఠ మనిపించు గమన మీపు
ఏటి కెదరీది పనులు సాధించుకొమ్ము
*భావము :* ఉన్నతమైన లక్ష్యం మనసులో ఉంటే ఎన్ని బాధలు కల్గినా కష్టాలన్నింటినీ ఎదురీది జయము సాధించుకోవాలి
[7/2, 16:39] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*మనిషిని మహనీయునిగా మార్చేది. మాటలు నెమ్మదిగాను, పనులు ఉత్సాహంగాను చేసిననాడే.*
[7/2, 16:39] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*ఎండ కన్నెరుగక*
అతి సుకుమారముగ పెరుగుట.ఎండకన్నెరగక ఉండటం.భోగభాగ్యాల నడుమ మాత్రమే పెరగటం అన్నది భావన.అసలేనాడు ఎండలోకే రాకుండా ఉండటం
[7/2, 16:39] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*సింగడు అద్దంకి వెళ్లినట్టు*
సింగడు అద్దంకి వెళ్లినట్టు (సిద్దడు అద్దంకి వెళ్ళొచ్చినట్టు) - యజమానుల దగ్గర సిద్దడు పనివాడు, ఏంచెప్పినా సరిగా చేయడని అనుకొంటుంటారు. ఒక రోజు రాత్రి యజమానులు తనను ప్రొద్దున్నే అద్దంకి పంపించాలనుకోవటం విని, ఎలాగైనా మెప్పు పొందవచ్చని, అక్కడ పనేంటో తెలుసుకోకుండానే వాళ్ళు లేచే సరికి అద్దంకి వెళ్ళి వచ్చాడు. వివరం /ఉపయోగం లేకుండా ఎవరైనా వ్యక్తి పనిని చేసే సందర్భంలో ఈ సామెతను వాడతారు. అసలు సామెత " సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు " అని. దీని వివరం ఒక భార్యా భర్త పొద్దు పోయిన తరువాత రేపు సింగడిని (తమ పాలేరు) అద్దంకి పంపాలి అని అనుకోవడం విని. అద్దంకి వెళ్ళవలసిన అవసరం ఏమిటో తెలుసుకోకుండా, తెల్లవారకముందే సింగడు అద్దంకి వెళ్ళి వస్తాడు. తొందరపాటుతో అసలు విషయం తెలుసుకోకుండా నిష్ప్రయోజకరమైన పనులుచేసే వారికి ఈ సామెత వాడతారు.
[7/2, 16:39] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*టింగుటింగు గడియారం*
*- డా||వాసాప్రభావతి*
గోడ గడియారం నేనైతే!
టింగు టింగుమని గంటలు కొడతా!
పాపను నిద్ర లేపేస్తా!
బద్దకమంతా పోగొడతా!
చురుకుదనం నేర్పేస్తా!
వేళకు బడికి పంపిస్తా!
గంట గంటకు పాఠాలు నేర్పిస్తా]
వేళకు తిండి తినిపిస్తా
గంట కొట్టి ఇంటికి పంపిస్తా
వేళకు నిద్రకు పంపిస్తా
క్రమశిక్షణ అంతా
చక చక నేర్పిస్తా!
బుద్ధిమంతులుగ తీర్చిదిద్దేస్తా!
టింగు టింగు గంటలు కొట్టేస్తా!
[7/2, 16:39] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*
*🟥ఆపిల్ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది? Apple is sweet and Neem is bitter Why?*
🟩'జీవం' అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, 'కణ నిర్మాణం' అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది. ఆపిల్ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్ వంటి చక్కెరలున్నాయి. ఆపిల్‌పండును నోటికి తాకిస్తే నాలుక మీదున్న రుచిగుళికల (taste buds) మీదకు ఆయా పదార్థాలు కొద్దిగా చేరుకుంటాయి.
అక్కడ పరీక్ష చేసే డాక్టరులాగా రుచి నాడీ చివర్లు (taste nerve ends) ఉంటాయి. అక్కడ జరిగే విద్యుద్రసాయనిక చర్యల సారాంశంలో ప్రత్యేకమైన సంకేతాలు మెదడుకు చేరతాయి. ఆ సంకేతాలను మెదడు 'తీయదనం'గా భావించి ఇంకాస్త తినమని ప్రోత్సహిస్తుంది. వేపపండులో చేదుగుణాన్ని కలిగించే 'పిక్రిక్ ఆమ్లము' తదితర అవాంఛనీయమైన ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటికి క్రిమిసంహారక లక్షణాలు (antibiotic characters) ఉన్నాయి. కాబట్టి పొలాల్లో క్రిమి సంహారిణులుగా వాడితే మంచిది. నోట్లో వేసుకొంటే ఆ నాడీ చివర్ల జరిగే రసాయనిక సంకేతాలు 'మరోలా' ఉండడం వల్ల ఆ సంకేతాల సారాన్ని మెదడు 'చేదు' అంటూ మానెయ్యమంటుంది. తినగాతినగా వేము తియ్యగా ఎప్పుడూ మారదు.
వేప చెట్టులో దాదాపు అన్ని భాగాలు చేదుగా ఉంటాయి. ప్రత్యేకంగా వేపాకులో మరీను. కారణం వేపాకులో చెడు రుచిని కలిగించే వృక్ష సంబంధ సేంద్రియ పదార్థాలే. (Phyto organic chemical) ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి నింబిన్(Nimbin) , నింబిడిన్(Nimbidin)లు.
20వ శతాబ్దపు 4వ దశకంలో సిద్ధిక్వి అనే పాకిస్తాన్ శాస్త్రవేత్త వేపలోని రసాయనాల మీద పరిశోధనలు చేశారు. 1995 సంవత్సరంలో ఐరోపా పేటెంటు సంస్థ అమెరికా వ్యవసాయ సంస్థ (American department of agriculture) అదే దేశానికి చెందిన wr grace and company కి వేప మీద పేటెంటు హక్కుల్ని ఇచ్చింది. కానీ 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం దాదాపు 2వేల సం||రాల తరబడి వేప వినియోగం భారత దేశంలో ఉందని వాదించగా అమెరికా వారి పేటెంటు హక్కుల్ని తీసేసి భారత దేశానికి ఇచ్చారు. కానీ 2005 సం. లో తిరిగి wr grace and company భారత్‌లో వేప వాడకం ఆచరణలో ఉన్నా ప్రచురణ (publication) లేదని వాదించి తిరిగి పేటెంటు హక్కుల్ని సాధించుకొంది.
No comments:
Post a Comment