Saturday, July 5, 2025

 *మృత్యుభయం.....*

*పుట్టుక అనేది మన ప్రమేయం లేకుండా జరిగే ఓ ఘటన. అలాగే.. జీవితమూ, అందులోని ప్రతి సన్నివేశమూ మనకు తెలియకుండానే సంభవించేవే.. నీవు ప్రణాళిక వేసుకుని చేసే కర్మలైనా సరే.. అట్లే.. చివరకు మరణమూ అంతే. అది కూడా మన చేతుల్లో లేని ఓ నివారించలేని ఓ హఠాత్ ఘటనే.*

*మరి మనం ఏ మాత్రం నివారించలేని ఈ హఠాత్ సంఘటనల సమ్మేళనమైన జీవితం పట్ల.. చిట్టచివరి ఘటన ఐన మరణం పట్ల మానవుడు ఎందుకు ఆందోళన పడడం.. ఆందోళనకు మూలకారణం ఒక్కటే.. నేను - నాది అనే భావన. అందుకే.. నిజానికి ఈ నేను - నాది అనేవి ఎవడి సొత్తో వాడికే (ఈశ్వరుడికి) స్వచ్ఛందంగా అప్పజెప్పడమే శరణాగతి..*

*మానవుడు ఈ నేను - నాది అనే భావనను వదలనంతవరకు వానికి మృత్యుభయం తప్పదు. దృతరాష్ట్రుడు అటువంటి భావనను వదలకనే మృత్యుభీతితో ఇలా ప్రశ్నించాడు సనత్సుజాతులవారిని..*

*దృతరాష్ట్రుడు: మీరు చిరంజీవులు.. సృష్ట్యాది నుండి మీరు* *ఇలానే ఉన్నారు.. మా పూర్వీకులందరూ మరణించారు.. త్వరలో నేనూ మరణిస్తాను.. మీ విషయంలో చూస్తే మరణం అర్థరహితం.. మా విషయంలో చూస్తే.. మరణం అనివార్యం.. ఇంతకీ మరణం అనేది ఏమి.. మరణం అనేది ఉందా.. లేదా..*

*సనత్సుజాతులు: నీవు శాశ్వతమైన వస్తువును ధ్యానిస్తే నీవు శాశ్వతుడవు.. నీవు అశాశ్వతమైన వస్తువును ధ్యానిస్తే నీవు అశాశ్వతుడవు.. అని అన్నారు.*

*అశాశ్వతవస్తువులైన నేను - నాది లను వదిలి శాశ్వతమైన మహేశ్వరుని చరణాలకు శరణుపొందుదాం.‌. ఆ పరిపూర్ణార్పణం వలన మానవుడు కూడా ఈశ్వరుడవుతాడు.. అంటే.. ఈశ్వరుడు లో మమఐక్యము అవుతాడు.. మృత్యుదేవతకు తానే అధిపతి అవుతాడు.. మరణభయం లేని కాలకాలుడవుతాడు...*

*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚⚜️🦚 🙏🕉️🙏 🦚⚜️🦚

No comments:

Post a Comment