మొగుడు పెళ్ళాలు 98
*భార్య భర్తల మధ్య ఆకర్షణ అవసరమా?*
నేటి కాలంలో ఇది అత్యంత అవసరం ఎందుకంటె మొగుడు పెళ్ళాల మధ్య
బoధం పది కలాల పాటు పచ్చగా ఉండాలంటే ఆకర్షణ తప్పని సరి
ఆకర్షణ అంటే ముందుగా బాహ్య తరువాత అంతర్ సౌందర్యం గురించి చెప్పాలి ఇంట్లో భర్త ముందు భార్య ఎప్పుడు మాక్సీలతో తిరుగుతుంటే మభర్తకు చూడడానికి బోర్ కొడుతోంది ఆఫ్ కోర్స్ బయటకు వెళ్లినప్పుడు ఎలాగ అందంగా తయారవుతాయరనుకొండి అంతలా నగలు నట్ర వేసుకుని ఇంట్లో వున్నప్పుడు తిరగక్కరలేదు కానీ ఒక రోజు చీర మరొకరోజు చూడీదార్ తరువాత రోజు పంజాబీ డ్రెస్ ఆ తరువాత లాంగ్ ఫ్రాక్ ఇంకా ఎన్నో వెరైటీ డ్రస్ లు మార్కెట్లో లబభ్యమవుతున్నాయి అప్పుడు భర్త లో భార్యమీద ఇంటరెస్ట్ పెరుగుతోంది
అలాగే భర్త కూడా ఎప్పుడు లుంగీలతోను నిక్కర్లతోను ఇంట్లో తిరుగుతుంటే ఇంట్లో భార్యకు బోర్ కొడుతుంది అందుకే భర్త ఇంట్లో ఉన్నపుడు చక్కగా టీ షర్ట్ లు వెరైటీ డ్రెస్సులు వేసుకోవాలి అవి ఇరువురికి నచ్చే కలర్స్అయితే మరీమంచిది
నీట్ గా ఉండడం అత్యంత అవసరం వీలైతే రెండుపూటలా స్నానం చెయ్యాలి
ఇంక అంతర్ సౌదర్యం అంటే మృదువు గా ప్రేమగా మాట్లాడడం సమస్యలొస్తే ఇద్దరు కలసి చర్చించుకోవడం ఒకరికి వంట్లో బాగుండకపోతే మరొకరు వారిమీద కేర్ గ ఉండడం అవసరమైతే హాస్పిటల్ కి తీసుకువెళ్లడం టైం కు మందులు వెయ్యడం వంటలో సహాయపడడం పుట్టిన రోజు పెళ్లి రోజు రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని విష్ చేసుకోవడం బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం కాస్త బాగానే సెలెబ్రేట్ చేసుకోవడం
ఆఫీసు నుండి కనీసం రెండు సార్లు ఫోన్ చెయ్యడం పిల్లల గురించి పట్టించుకోవడం ఇరువైపులా తల్లితండ్రులను బంధువులను గౌరవంగా ప్రేమగా చూడడం
ఒకరినొకరు నొప్పించే మాటలు మాట్లాడకపోవడం తప్పు చేస్తే సారీ చెప్పడం సర్దుకు పోవడం నీకు నేను నాకు నువ్వు అనే భావంతో ఉండడం చిన్న చిన్న కోరికలు వాయిదాలు వేయకుండా తీర్చుకోవడం అవసరం
జీవితంలో శృoగారానికి ప్రాధాన్యత ఇవ్వడం- ఇవన్నీ మొగుడు పెళ్ళాల మధ్య తప్పని సరిగా ఉన్నప్పుడు డబ్బు విషయంలో నాది ననది అనే తారతమ్యాలు లేకుండా ఖర్చు పెట్టుకోవడం పొదుపు చేసుకోవడం అత్యవసరం ఇవన్నీ చెయ్యగలిగితే ఆ మొగుడు పెళ్ళాల మధ్య మూడో వ్యక్తి దూరే అవకాశం వుండదు
విడాకుల ప్రశ్నే రాదు ఏమంటారు?
బి మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
No comments:
Post a Comment