Saturday, July 5, 2025

 *యుద్ధాల ముసుగులో జరిగిందేమిటంటే.. రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చిన దేశాలు ఆర్థికంగా అమెరికా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. IMF, World Bank, NATO వంటి సంస్థలు దీప్ స్టేట్ వలలోనే ఉన్నాయి.*

*వీటి ద్వారా ప్రపంచ దేశాలను రుణాల పేరిట ఆర్థిక నియంత్రణలోకి తీసుకెళ్లడం ప్రారంభమైంది. దేశాలు స్వతంత్రంగా కనిపించినా.. వారి ఆర్థిక విధానాలు, నాణేలు, బడ్జెట్లు అన్నీ అమెరికా డాలర్‌ ఆధారంగా మారిపోయాయి.*

*ఇది వాస్తవంగా కొత్త రకం వలస పాలన (Neo Colonialism). ఇది గాలిలో కాదు – ఇది డాలర్‌లో, బ్యాంకింగ్ వ్యవస్థలో, వాణిజ్య ఒప్పందాల్లో జరుగుతుంది.*

*పాకిస్తాన్‌కి అమెరికా ఆయుధాలు ఇచ్చినట్టు చూపించి భారత్‌కి మరింత ఖరీదైన ఆయుధాలు అమ్మడం – ఇదొక వ్యూహం. అదే విధంగా చైనా-తైవాన్, ఇరాన్-ఇజ్రాయెల్ వంటి కలహాలూ అదే స్క్రిప్టు ప్రకారం.*

*ఈ "దీప్ స్టేట్" వారికి మీడియా అనే శక్తివంతమైన ఆయుధం ఉంది. ప్రపంచ ప్రజల మెదళ్లను వారి కథనాలతో మానిప్యులేట్ చేయగలిగారు. యుద్ధాలు వస్తున్నాయని భయపెట్టి దేశాలకు భారీ ఆయుధాలు అమ్మటం – ఇదీ వారి వ్యాపార మోడల్.*

*ప్రతి యుద్ధానికీ ముందు, డాలర్‌ విలువ పెరగడం, ఆయుధ కంపెనీల షేర్ల విలువ పెరగడం వంటి ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ గమనించిన వారు, ఇది మామూలు సంఘటనల కాదని గ్రహించగలరు.*

*అందుకే సుదీర్ఘంగా చూస్తే.. అన్ని యుద్ధాలూ ముందే స్క్రిప్ట్ రాసిన మాయా నాటకాలు. దేశాల మధ్య ద్వేషం మానవ సంబంధాల్లో కాదు.. రాజకీయ వ్యూహాల్లో సృష్టించబడ్డదే.*

*భవిష్యత్తులో యుద్ధాలు శక్తుల కోసం కాక, డిజిటల్ డాలర్, డేటా ఆధిపత్యం కోసం జరుగుతాయి. మనం ఇకపై శత్రువులను బయట వెతకకూడదు – నిజమైన శత్రువు "లోపలి స్క్రిప్ట్"లో ఉంది.*

No comments:

Post a Comment