[7/8, 08:36] +91 79819 72004: *💎 నేటి ఆణిముత్యం 💎*
మరణమునకైన సిద్ధమై వెరవకుండ
ప్రసవ వేదన నెంతొ నిబ్బరము తోడ
తాను భరియించి బిడ్డకు ప్రాణమిచ్చు;
తల్లి మించిన మరియొకదైవ మెవరు?
*భావము :*
మరణ భయం లేకుండా ప్రసవ వేదన ధైర్యంగా భరించి బిడ్డకు ప్రాణమిచ్చే తల్లి కంటే మరో దైవం లేదు.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[7/8, 08:36] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు నెగెటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగుచేయలేదు.*
[7/8, 08:36] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*జెండా ఎత్తర...*
జెండా ఎత్తర - జాతికి ముక్తిర
నిండగు శక్తిర - నిల్పర కీర్తిర
- జెండా ఎత్తర...
దండిగ వైరులు - గుండులు ప్రేల్చిన
చెండుచు, నెత్తురు - కండలు రాల్చిన
- జెండా ఎత్తర...
ప్రాణముండే, యభి - మానముండే, మన
ప్రాణములైనన్ - బలియొసంగి, మన...
జెండా ఎత్తర ! జాతికి ముక్తిర !!
*- గురజాడ*
[7/8, 08:36] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అగ్నికి వాయువు తోడైనట్లు*
అగ్నిని ఎవరైన చల్లార్చడానికే ప్రయత్నిస్తారు. అలాంటి అగ్నికి వాయువు తోడైతే చల్లార్చడం చాలా కష్టం. మన కోపాన్ని అగ్నితో పోలుస్తారు. ఎవరైనా ఎవరి మీదైనా అగ్నిలాంటి కోపంతో ప్రజ్వరిల్లుతూ ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్ళు కావలసినవాళ్ళైతే ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాని మధ్యన ఉండేవాళ్ళు కానివాళ్ళు ఐతే ఆ కోపాన్ని ఉన్నవీ లేనివి చెప్పి పెంచడానికి చూస్తారు. ఇలాంటి సమయంలో ఈసామెతని వాడుతారు. *అగ్నిలో ఆజ్యం పోసినట్లు* అనే సామెతను కూడా ఇలాంటి సందర్భంలో వాడుతారు.
[7/8, 08:36] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*ఒంటి మీద ఒకటి బండ మీద ఒకటన్నట్టు*
పేదరికానికి ప్రతీక.కనీసం కట్టుబట్టలు లేని స్థితి.ఒంటి మీద ఒక వస్త్రం ఆచ్ఛాదనగా ఉంటే మరొకటి మాత్రమే ఉతకటానికి సిద్ధంగా ఉండటం.
[7/8, 08:36] +91 79819 72004: ✍🏽 *నేటి కథ* ✍🏽
*మొండి గాడిద*
*ఒక గాడిదను తన యజమాని జాగ్రత్తగా ఒక కొండ మీంచి కిందికి తోల్తుంటే, ఆ మొండి గాడిద హఠాత్తుగా యజమాని మాట వినకుండా, తన దారిని తను వెళ్లాలని నిశ్చయించుకుంది.*
*కొండ కింద వున్న ఇల్లు కనిపిస్తోంది.*
*“యజమానికి ఏమీ తెలీదు – ఇంత సేపటినుంచి తోల్తున్నాడు కాని ఇంటి వైపుకి కాకుండా ఈ కొండా చుట్టూరా నడుస్తున్నాము. యజమాని యెంత మూర్ఖుడు!” అనుకుంది గాడిద. “ఒక్క గెంతు వేస్తె ఆ కొండ దిగిపోతాము కదా!” అనుకుంది.*
*అంచున నుంచుని దుంక పోతుంటే యజమాని వెనక్కి లాగాడు, కానీ మొండి గాడిద వినే మూడ్ లో లేదు. యజమాని యెంత వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందరికి లాగింది.*
*చివరికి తప్పక యజమాని గాడిదని వదిలేయాల్సి వచ్చింది. “నిన్ను వెనక్కి లాగబోయి నేను పడిపోతాను! పొ! నీ ఖర్మ!” అని తిట్టుకున్నాడు.*
*యజమాని వదల గానే గాడిద ఒక గెంతు వేసింది. ఇంకేముంది? కొండ అంచు మీంచి డొల్లుకుంటూ కింద పడి ప్రాణాలు కాలిపోయింది.*
*శ్రేయోభిలాషుల మాట వినకుండా, వారి సలహాలను నిరాకరించి, మొండిగా ముందుకు వెళ్ళే వాళ్ళు గమ్యం చేరుకోలేరు.*
*సేకరణ*
[7/8, 08:36] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*
*🐠చేపలు నీళ్లు తాగుతాయా?Do fish drink water?🦈🐟*
ఈ ప్రశ్నకు జవాబు అవును, కాదు అని రెండు విధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఉప్పునీటి చేపలు నీళ్లు తాగుతాయి. అదే మంచినీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు. దీనికి కారణం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలోని ద్రవాభిసరణము (osmosis) అనే ప్రవాహుల (fluids) ధర్మాలను తెలుసుకోవాలి. వీటి ప్రకారం రెండు వేర్వేరు గాఢతలు (concentrations) గల ద్రవాలను ఒక సన్నని పొర (మెంబ్రేన్) విడదీస్తుంటే, నీరు ఎక్కువ గాఢతగల ద్రవం వైపు ప్రవహిస్తుంది.
మంచి నీటిలో ఉండే చేప శరీరంలోని ద్రవం, దాని చుట్టూ ఉండే నీటి గాఢత కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ చేప శరీరంలోకి బయటి నీరు దాని చర్మం, మొప్పల ద్వారా శోషింపబడుతుంది. అలా దాని శరీరంలోకి ప్రవేశించిన నీటిని చేప బయటకు వదలక పోతే సమయం గడిచే కొద్దీ ఎక్కువ నీరు చేరడం వల్ల దాని శరీరం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక ఉప్పునీటి చేప విషయంలో ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇక్కడ చేప చుట్టూ ఉండే నీటి గాఢత ఎక్కువగా ఉండడంతో చేప శరీరంలోని నీరు బయటకి స్రవిస్తుంది. అందువల్ల ఉప్పునీటి చేప సమయం గడిచే కొద్దీ శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల శుష్కించి, ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ చేప తన చుట్టూ ఉండే నీటిని మొప్పలు, నోటి ద్వారా తాగుతుంది. ఆ నీరు దాని శరీరంలోకి చేరక ముందే మొప్పలు ఉప్పునీటిలోని ఉప్పును విసర్జిస్తాయి.
No comments:
Post a Comment