Thursday, July 10, 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*శ్రీకృష్ణుడు అర్జునుడికి రుజువు చేసిన కర్ణుడి దానగుణం*

 
దానంలో కర్ణుడి  గుణం ఎంతో ప్రాముఖ్యమైనది. కర్ణుడు కవచకుండలాలు లతో జన్మించాడు. కర్ణుడి వల్ల తన కుమారుడు అయిన అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా ఇవ్వమని కోరాడు. అయితే సూర్యుడు ఇలాంటి మోసం ఏదో జరుగుతుంది ముందుగానే ఊహించారు. దేవేంద్రుడు విప్రరూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు వాటిని మాత్రం ఇవ్వకు అని తన కుమారుడు అయిన కర్ణుడిని సూర్యుడు ముందుగానే హెచ్చరించాడు. కానీ సహజ దానశీలి అయిన కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినా వాటిని కోసి దానంగా ఇచ్చాడు. 

ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడు దాన గుణాన్ని మెచ్చుకున్నాడు. అది నచ్చని అర్జునుడు బావ కర్ణుడు దాన గుణంలో విశేషం ఏముంది? ఇతరుల సొమ్మును దానం చేయడంలో గొప్పతనం ఏమిటి? తన సొమ్మును దానం చేస్తే అది ఘనత! అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కర్ణుడు దాన గుణం ఎంతో రుజువు చేయాలి అనుకున్నాడు.
     ఆరోజు సంపూర్ణ సూర్యగ్రహణం.కౌరవులు,పాండవులు, ఇతర బంధువులు ద్వారకకు సముద్ర స్నానానికి వెళ్లారు. కర్ణుడి దాాన గుణం రుజువు చేయడానికి అదే మంచి సమయం అనుకున్నాడు శ్రీకృష్ణుడు. కొద్దిసేపట్లో గ్రహణం వీడుతుంది అనగా గా ఇసుక తిన్నెలను నవరత్నన రాశులుగా మార్చేశాడు.
అర్జునుడిని సమీపించి"అర్జున! గ్రహణ శాంతిిి కి ఇంకా ఇంకాా కొద్ది కాలమే ఉంది. ఈ అమూల్య రత్న రాశులను ఒక్కటి కూడా మిగలకుంంండా ఇక్కడ ఉన్న బ్రాహ్మణులకు దానం ఇవ్వు. ఎంత వేగంగా దానం చేస్తావు చూస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు.

    అర్జునుడు ఒక చేత తో వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడు. ఆ రత్న రాశులలో ఒక్క రాశి కూడా పూర్తి కాలేదు. గ్రహణ విముక్తి సమయంం దగ్గరపడుతోంది. అర్జునుడికి ముచ్చె మటలు పడుతున్నాయి. కానీ దానం పూర్తి కాలేదు.
     అది చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఏం బావ దాన గుణం సహజంగానే రావాలి. అదిిిి ఒక కళ అంటే కాదన్నావు. పరుల సొమ్ము పంచి పెడుతున్న ఒక్క రత్నాల గుట్టను కూడా పూర్తిగా దానం చేయలేకపోయారు.

ఇక చూడు కర్ణుడి దాన గుణం మహిమను రుజువు చేస్తాను అని చెప్పి దూరంగా నిలబడ్డ కర్ణుడి దగ్గరకు వెళ్ళాడు. కర్ణ! గ్రహణ విముక్తికై కాకముందే రత్న రాశులను దానం చెయ్యి అన్నాడు. దానం చేయడంలో ఆరితేరిన కర్ణుడు నిలిచిన చోట నుండి కదలకుండానే ఒక్కొక్క బ్రాహ్మణునకు ఒక్కో రాశి చొప్పున దానం చేసి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? అని శ్రీకృష్ణుడు  నీ ప్రశ్నించాడు. అప్పుడు  శ్రీకృష్ణుడు అర్జునుడితో బావా చూసావా కర్ణుడి దాన గుణం ఎలాంటిదో! అదిిిి సహజ సిద్ధంగా రావాలి అన్నదిి అందుకే అన్నాడు.
   అర్జునుడు మౌనంగా అంగీకరించాడు. అందువల్లనే కర్ణుడు దాన గుణంలో గొప్ప వాడు అన్నాడు. 


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment