*కాఫీ విత్…పొన్నాడ మూర్తి గారు..2291
*పెన్సిల్ వుంటే చాలు..బొమ్మ పడిందన్న మాటే.
పొన్నాడ " వారి పెన్సిలే వేరు…!!
*వయో వృద్ధుల రుణం తీర్చుకున్నారు మూర్తి..!!
“పొన్నాడ మూర్తి“ పేరుతో కార్టూన్లు,చిత్రాలు వేసే శ్రీ
పొన్నాడ వెంకట రమణ మూర్తిగారు గత 30 యేళ్ళ
నుంచి చిత్రకారులుగా,కార్టూనిస్ట్ గాకొనసాగుతున్నా
రు.కార్టూన్ల కన్నా బొమ్మలంటేనే.మూర్తి గారికి ఇష్టం.
మూర్తిగారు పెన్సిల్ చిత్రాలకు పెట్టింది పేరు..పెన్సిల్
✏️ పెన్సిల్ తో ఆయనిచ్చే స్ట్రోక్స్ తోహావభావాలను
పండించడం ఆయనకే చెల్లుతుంది.మూర్తిగారురంగు
ల బొమ్మలు కూడా వేస్తారు.బాపు గారికొన్ని బొమ్మ
లకు రంగుల్ని కూడా అద్దారు. గీతా ఏదైనా....అది మూర్తి గారి పెన్సిల్/కుంచెలో జీవం పోసుకోవాల్సిం
దే..!!
వివిధ రంగాలలో ప్రముఖులైన వారిచిత్రాలను వేయ
టమేకాక ఎఫ్బీలో వారిగురించిక్లుప్తంగా,రాస్తుండటం
విశేషం. అలా ప్రతిరోజూ ఒక చిత్రం.ఫేస్ బుక్లో పోస్ట్
చేయడం ఆయన హాబీ. నిన్నఆయన వృద్ధాప్యం పై
ఓ బొమ్మను పోస్ట్ చేశారు..వారు ఇంతవరకు వేసిన
ఆయన చిత్రాల ‘నిధి’లోకి తొంగిచూస్తే వృద్ధాప్యానికి
సంబంధించిన అనేక చిత్రాలు కనిపించాయి.
అవేమీ…అల్లాటప్పా చిత్రాలేం కాదు.మన జాతిపిత మహాత్మాగాంధీ మొదులు కొని దేశాన్ని యేలిన రాజ
కీయ నాయకులవి.అంతేనా? పేరొందిన కవులు,కళా
కారులు,నాటకకర్తలు,రచయితలు,స్వాతంత్ర్య సమ
ర యోధులు,శాస్త్రవేత్తలు ఒకరేమిటి..మనదేశ సంక్షే
మానికి,సమాజానికి గొడుగు పట్టిన మహానుభాలే.
వృద్ధులైన వారి చిత్రాలువేసి మూర్తి గారు రుణం తీర్చుకున్నారు..
మూర్తి గారి చిత్రాలను దృష్టిలో వుంచుకొని ఈరోజు కాఫీ టైమ్లో వృద్ధాప్యం/ వృద్ధులు గురించి మాట్లాడు
కుందాం.!!
*మనిషి ఏడో రుతువు...వృద్ధాప్యం.!!
మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీవృద్ధాప్యం.
మనం కాదనుకున్నా కూడా కోరి వచ్చేదే వృధ్ధాప్యం.
మనిషి జీవితం రుతువులతో ముడిపడి వుంటుంది.
వసంత రుతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది.వసంతకాలం మన పుట్టుకఅనుకుంటే,
శిశిరం వృద్ధాప్యం.వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా,
రంగు రంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లా
సభరితమవుతుంది.ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి,ఎండి, రాలి,చెట్లు మోడులవుతాయి.అలాగే
వృద్ధాప్యంలో…మనిషి దేహం కూడా ఒడలి,ఒంగి ఎండిన మోడులా కనిపిస్తుంది.
వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటా
రు జనం.నిజానికి వృద్ధాప్యం శాపమో….పాపమో
కాదు.అది ప్రకృతిపరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటివాళ్ళు సరే కుటుంబ సభ్యులుకూడాతేలిగ్గా
చూస్తారు.ఏంమాట్లాడినా,యేం చేసినా..వాళ్ళకు నచ్చదు సరికదా..' 'చాదస్తం ' అంటూ తీసిపారేస్తా
రు..లోకువగా చూస్తారు.
*వృద్ధాప్యం పాపమా? శాపమా?
మానవ జీవితంలో వృద్ధాప్యం చివరి మజిలి. ఇక్కడి
వరకు చేరుకోడానికి మనిషి ఎంతో.. కష్టంతో మనిషి ఈ దశకు చేరుకుంటాడు. నిజానికి మనిషిజీవితంలో
ఆఖరి శ్వాసల గుడారం..వృద్ధాప్యమే.మనకు,డబ్బు
దస్కం,ఆస్తులు,అంతస్తులుఎన్నైనావుండొచ్చు.మన
చుట్టూ,మనల్ని ఇష్టపడే. ఓ నలుగురు లేకుంటేఎన్ని
వున్నా వ్యర్ధమే..!
అందుకే ….,
మనం లోకంలో వున్నంతకాలం నలుగురితో మంచి
గావుండాలి .మన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసుకోవాలి.మనల్ని చిన్నచూపు చూపు… చూసే వాళ్ళెవరైనా.. చివరకు వాళ్ళు కన్నబిడ్డలైనా దూరంగా వుంచాలి..వృద్ధాప్యాన్ని శాపంగా కాకుం
డా, వరంగా భావించాలి..జీవితపు చివరి క్షణా ల్ని పరిమళ భరితం చేసుకోవాలి..మనం లేకున్నా..మన
గురించి మాట్లాడుకునే నాలుగు మంచి పనుల్ని చేయాలి..మన జ్ఞాపకాలు ఆకుపచ్చగా పదికాలా
లుండేట్లు చూసుకోవాలి..అప్పుడే వృద్ధాప్యం దండగ
గా కాకుండా పండగవుతుంది.మన జన్మకు ఓ సార్ధ
కత దొరుకుతుంది..
*మానవ జన్మ అద్భుతం
దాని ప్రాయం బుద్బుదం
కడ సంజ వెచ్చని వీడుకోలు
తొలి సంజ పచ్చని ఆహ్వానం
జననం ఒక సంభవం
అది కోటి దీపాల కోవెల
జవ్వనం ఒక సందర్భం
అది కోటి రాగాల కోయిలర
వార్థక్యం అందాల జలపాతం
అది సడిలేని వెన్నెల గీతం"!!
*హనుమారెడ్డి..
మానవజన్మ గురించి హనుమారెడ్డి ఐదు ముక్క
ల్లో చెప్పారు.మనిషి జన్మ ఓటికుండ.అదిఎప్పుడై
నా పగలక తప్పదు.జననం పచ్చని ఆహ్వానమైతే,
మరణం వెచ్చని వీడ్కోలు.వార్ధక్యం ఓ అందాల
జలపాతం.అది సడిలేని " వెన్నెల గీతం " అంటారు
హనుమారెడ్డిగారు.!!
*ఎ.రజాహుస్సేన్…!!
No comments:
Post a Comment