Thursday, July 10, 2025

 *_దేవుడు ఎలా ఉంటాడో తెలుసా?_* 
_(ఎప్పుడైనా చూశారా?.. లేదా..! అయితే రండి ఇప్పుడే చూద్దాం.)_
================

*ఒక పిల్లాడు దేవుడిని చూడాలి అనుకున్నాడు. బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు.*

*అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బేగ్ లో రెండు జతల బట్టలు కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు. అలసిపోవడంతో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు.* 

*దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు. ఆకలి అనిపించింది. ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు. పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా చూస్తూ కనబడింది. ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు.*

*ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా నవ్వింది. ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు. ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు. ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది.* 

*ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది. మద్యాహ్నం అంతా అతను అలా ఇస్తున్నాడు. ఆమె తీసుకుంటోంది. నవ్వుతోంది. ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.*

*సాయంత్రం అయ్యింది. చీకటి పడుతోంది. లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు. వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు. ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు. ఆమె కూడా అతడిని దగ్గరకు తీసుకుని అందమైన తన నవ్వును బదులు ఇచ్చింది.*

*ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతడి ముఖంలో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ...* 

*కన్నా ! ఏమిటి రా ! ఈ రోజు నీ ముఖంలో అంత ఆనందం కనబడుతోంది. ఈ రోజు ఏమి జరిగిందిరా ? అని అడిగింది.* 
.
*“నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు.* 
.

*అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే “నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు.* 
.
*అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది. ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” అడిగాడు కొడుకు.*
.
*“ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో. అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి పార్కులో కేకులు కూడా తిన్నాను.”* 
.

*“దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా!”*
.
.
*_ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం ????_*
.
*ఒక ఆత్మీయ స్పర్శ, ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న మాట, ఒక చిన్న ఆలకింపు, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు.*
.
*మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు.*
.
*🙏జీవితంలో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు, దైవ సంకల్పం .... అది ఒక క్షణం కావచ్చు, కొంత కాలం కావచ్చు, జీవితాంతం కావచ్చు🙏*
.
*🙏ఎదురుపడిన వారిని సమానంగా గౌరవిద్దాం ! అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం ! ఇది సాధన ద్వారానే సాధ్యం !🙏*
.
*🙏ఇతరులు మనలో కూడా దైవాన్ని చూడగలిగేలా ప్రవర్తిద్దాం !🙏*
--------------------
*_{నేను ఎక్కడో.. ఎపాప్పుడో చదివిన కథ ఇది: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

No comments:

Post a Comment