హాలో...
చెప్పక్కా...బావున్నావా..
ఏరా... పెళ్ళయి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే పెళ్ళాం మాటలు విని వేరు కాపురం పెడతానన్నావుట. ఒక్కగానొక్కడివి, ఈ వయసులో వాళ్ళిద్దర్నీ వదిలేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్లకెలాగ ?
ఏది... ఆ ఫోను నీ పెళ్ళానికి ఇవ్వు.
ఇదిగో ....మా అక్క లైన్లో ఉంది, నీతో మాట్లాడుతుందట
ఏమ్మా బాగున్నావా...
బానే ఉన్నానండీ...మీ ఇంట్లో అందరూ కులాసాయేనా వదినగారూ.
ఏవిటమ్మా సంగతులూ
ఏమీ లేవండీ మామూలే..
అన్నట్టూ, పొద్దున ఎందుకో మీ అత్తగారు గుర్తొచ్చారండీ, మీ అత్తగారిని ఎప్పుడో మా పెళ్ళప్పుడు చూసాను, మాట్లాడి చాలా రోజులైంది. పక్కనుంటే కాస్త ఫోన్ ఇవ్వండి ఒకసారి పెద్దమ్మతో మాట్లాడుతాను..
ఆవిడ ఇక్కడ ఎందుకు ఉంటారు వేరే ఇంట్లో ఉన్నారమ్మా ..
మీ తోడికోడలు వాళ్ళ దగ్గరుంటారాండీ...
భలే దానివేనే..
మా వారు ఒక్కడే కొడుకు. అత్తయ్యగారూ మామయ్యగారూ మా దగ్గరుండరు. వేరే ఉంటున్నారు
ఓహో... మీ దగ్గర ఉండటం లేదా ?
సరేలెండి ...ఇందాక ఏదో అడగబోయారు
ఏమీ లేదమ్మా తమ్ముడితో మాట్లాడి చాన్నాళ్లు అయింది కదా అని ఫోన్ చేశాను. నువ్వు బావున్నావుగా
బానే ఉన్నానండి ..
సరేలేమ్మా ఉంటాను..
P Narasimha Rao
No comments:
Post a Comment