Friday, August 15, 2025

 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

*🧘‍♂️ ఒక యోగి ఆత్మకథ-🌼*

*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*


*🌼1-అధ్యాయం*

*🌼మా తల్లిదండ్రులు & నా బాల్య జీవితం:-*

 భగవద్‌ధ్యానానికి సంబంధించిన యోగం- అంటే "కలయిక" - అనే ప్రాచీన భారతీయశాస్త్రాన్ని సాధనచేసేవాడు (చూడండి అధ్యాయం 26 : 'క్రియా యోగశాస్త్రం'.


 1915లో నేను సనాతమైన ఆశ్రమ వ్యవస్థానుసారంగా సన్యాసం తీసుకున్నప్పుడు నా పేరు యోగానందగా మారింది. 1935 లో మా గురుదేవులు పరమహంస అన్న సాంప్రదాయిక బిరుదు ప్రసాదించారు (చూడండి అధ్యాయాలు 24, 42).


 మహామహులకుండే అద్భుత శక్తుల్ని గురించి అధ్యాయం 30 ‘అలౌకిక ఘటనల నియమం’ అన్నదాంట్లో వివరించడం జరిగింది.


 లాహిరీ మహాశయులు బోధించిన యోగ విధానం. దీంతో, ఇంద్రియాలు రేపే కల్లోలం శాంతించి; ఈ విశ్వచైతన్యమే తాను అన్న గుర్తింపు ఎప్పటికీ పెరుగుతూ ఉండే విధంగా మానవుడు సాధన చెయ్యడానికి అవకాశ మేర్పడుతుంది. (చూడండి అధ్యాయం 26).


 విశ్వపాలకరూపంలో భగవంతుడికి ఉన్న సంస్కృత నామం; ఇది ఈశ్ అన్న ధాతువునుంచి వచ్చింది - పాలించడం అని దీనికి అర్థం. హిందువుల పవిత్ర గ్రంథాల్లో భగవంతుడికి వెయ్యి పేర్లుంటాయి.


వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దార్శనిక అర్ధచ్ఛాయసు సూచిస్తుంది. ఎవరి సంకల్పం వల్ల లోకాలన్నీ వ్యవస్థిత చక్రక్రమాల్లో సృష్టి అవుతూ వినాశం చెందుతూ ఉంటాయో అతడే ఈశ్వరనాముడైన భగవంతుడు.


 ధ్వనికున్న అనంతమైన శక్తులు ఓం అనే సృజనాత్మక శబ్దంలోంచే ఉద్భవిస్తాయి. అణుశక్తులకన్నిటికీ వెనక ఉన్న విశ్వస్పందన శక్తి ఈ ఓంకారమే.


స్పష్టమైన అవగాహనతోనూ గాఢమైన ఏకాగ్రతలోనూ పలికే ఏ మాటకైనా ఫలించే శక్తి ఉంటుంది. ఉత్తేజకరమైన మాటల్ని గట్టిగాగాని మౌనంగాగాని పునశ్చరణ చేసినట్లయితే అవి ఫలిస్తాయని మనోవైజ్ఞానిక చికిత్సకు సంబంధించిన అనేక వైద్య విధానాల్లో గమనించారు;


దీని రహస్యం, మనస్సుకున్న స్పందనాల రేటును పెంచడంలో ఉంది.

శాశ్వతురాలైన ప్రకృతిమాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే కాళి.

🌼🌿🌼🌿🌼🌿🌼🌿

*🌼అధ్యాయం: 2*

*🌼మా అమ్మ మరణం,విచిత్రమైన రక్షరేకు*


మా అమ్మకున్న కోరికల్లోకల్లా పెద్దది, మా అన్నయ్యకి పెళ్ళి చేసెయ్యాలన్నది. “అనంతుడి పెళ్ళాం మొహం కంటబడినప్పుడు ఈ భూమిమీదే స్వర్గం చూస్తాను!” తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చెయ్యడం తరచుగా వింటూ ఉండేవాణ్ణి.


అనంతుడి పెళ్ళికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను పదకొండేళ్ళవాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి, పెళ్ళి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది. నేనూ నాన్నగారూ మట్టుకే, ఉత్తరభారతదేశంలో ఉన్న బెరైలీలో ఉండేవాళ్ళం. అక్కడ రెండేళ్ళున్న తరవాతే, నాన్నగారిని లాహోరు బదిలీ చేశారు.


అంతకుముందు, మా అక్కలిద్దరికి రమకి ఉమకి- పెళ్ళిళ్ళయినప్పుడే చూశాను, వివాహవైభవం. కాని అనంతుడు ఇంటికి పెద్దకొడుకవడంవల్ల, ఈ పెళ్ళికి తలపెట్టిన ఏర్పాట్లు భారీఎత్తున సాగుతున్నాయి. రోజూ ఎక్కడెక్కడినుంచో, వచ్చే చుట్టాలనేకమందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తోంది.


 50 ఆమ్హరస్ట్ వీథిలో కొత్తగా మేము తీసుకున్న పెద్ద ఇంట్లో, వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటుచేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు, అన్నయ్య ఆడపెళ్ళి ​వారింటికి తరలివెళ్ళడాని కొక అందమైన పల్లకీ, రంగు రంగుల దీపాల తోరణాలు, భారీసైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు-స్కాటిష్-భారతీయ వాద్యబృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు.


పెళ్ళి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితోనూ కలవాలని నేనూ మా నాన్నగారూ మంచి ఉత్సాహంగా ఉన్నాం. కాని ఆ వివాహమహాత్సవం నాటికి కొన్నాళ్ళముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు అనుభూతమైంది.


బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి. మా బంగళా వసారాలో నేను, మా నాన్నగారి పక్కన పడుకుని ఉండగా, మా మంచానికున్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపమనేసరికి నాకు మెలకువ వచ్చింది. పలచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిలాయి. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను.

సశేషం:-

No comments:

Post a Comment